ఎన్టీఆర్‌‌కు షాకిచ్చిన రాజమౌళి

Rajamouli gave shock to Ntr

03:16 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Rajamouli gave shock to Ntr

'స్టూడెంట్‌ నెం.1' చిత్రంతో మొదలుపెట్టి ఆ తరువాత వరుస హిట్లు అందుకుని ప్రత్యేకంగా బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్న ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఇటీవలే 'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్‌ని పరిచయం చేస్తూ మరింత గుర్తింపు పొందాడు. రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' చిత్రం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం తరువాత రాజమౌళి 'గరుడ' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ వెయ్యి కోట్లతో తెరకెక్కిస్తుందని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ని రెడీ చేయమని రాజమౌళి తన తండ్రైన విజయేంద్రప్రసాద్‌కి చెప్పడంతో ఆ కధని రెడీ చేసే పనిలో విజయేంద్రప్రసాద్‌ నిమఘ్నమైనట్లు తెలుస్తుంది.

అయితే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ శ్రీకృష్ణుడుగా నటిస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో సమాచారం వచ్చింది. అదేంటంటే శ్రీకృష్ణుడు గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ని తీసుకోవాలని రాజమౌళి నిర్ణయించుకున్నాడట. 1000 కోట్లు బడ్జెట్‌ కావడంతో రాజమౌళి ఎన్టీఆర్‌ ని పక్కన పెట్టి హృతిక్‌ రోషన్‌ ని తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యాడట. అయితే ఎన్టీఆర్‌ బాధపడకుండా రాజమౌళి మరో చిత్రాన్ని ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తాడట.

English summary

Rajamouli gave shock to Ntr. He is not working with Ntr in Garuda movie as Lord Sri Krishna. He like to take with Hritik Roshan as Sri Krishna.