'గ్యారేజ్‌' కోసం ఎన్టీఆర్‌కి జక్కన్న హెల్ప్

Rajamouli gave suggestion to Ntr for Janatha Garage

03:36 PM ON 9th February, 2016 By Mirchi Vilas

Rajamouli gave suggestion to Ntr for Janatha Garage

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' విజయం తరువాత తాజాగా నటిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే నాన్నకు ప్రేమతో చిత్రం తరువాత ఎన్టీఆర్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు మాస్‌ ఫాలోయింగ్‌ మాత్రమే ఉన్న ఎన్టీఆర్‌కి ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫాలోయింగ్‌ కూడా జతయ్యింది. దీనితో ఎన్టీఆర్‌ తరువాత నటించే చిత్రం పై భారీ అంచనాలు పెరగాలి, దానికి తగ్గట్టుగా సినిమా కూడా ఉండాలి, కచ్చితంగా హిట్‌ అయ్యి తీరాలి. దాని కోసం ఎన్టీఆర్‌కి దర్శకధీర రాజమౌళి ఒక సలహా ఇచ్చాడట.

ఈ చిత్రం పై అంచనాలు పెరగాలంటే మంచి క్రేజ్‌ ఉన్న నటుల్ని ఎంచుకోవాలి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే మోహన్‌లాల్‌, ముకుందన్‌, సమంత, నిత్యామీనన్‌ లాంటి స్టార్లను ఎంచుకున్నారు. దీనికి తోడు మోహన్‌లాల్‌ కి భార్యగా అలనాటి హీరోయిన్‌ దేవయానిని ఎంచుకుంటే బాగుంటుందని రాజమౌళి సలహా ఇచ్చాడట. ఎన్టీఆర్‌ కూడా రాజమౌళి సలహాని పక్కన పెట్టకుండా ఈ విషయాన్ని కొరటాల శివ కి చెప్పాడట. దానితో కొరటాల శివ కూడా దేవయాని ని ఎంచుకోవడంలో మొగ్గు చూపాడట. తనకోసం రాజమౌళి ఇంత మంచి సలహా ఇచ్చాడని ఎన్టీఆర్‌ చాలా సంతోషించాడట.

English summary

S.S. Rajamouli gave suggestion to Ntr for Janatha Garage movie. He gave suggestion to select Devayani as a wife for Mohanlal.