రాజమౌళి కి సరే... మరి నాకో...

Rajamouli got Padamasri award but for me

11:58 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Rajamouli got Padamasri award but for me

స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళికి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈ విషయం పై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు. తనదైన శైలిలో రాజమౌళిని పొగుడుతూనే తన బాధను బయటకు చెప్పుకున్నాడు వర్మ. రాజమౌళికి పద్మశ్రీ దక్కింది కానీ నాకు పద్మ కూడా దక్కలేదని వర్మ ఫీలయ్యాడు. ఇంతకీ పద్మ అంటే అవార్డు కాదట. వర్మ చిన్నతనంలో ఇష్టపడిన అమ్మాయి పేరు పద్మ అంట. అయితే ఈ విషయంలో బాహుబలియర్‌ ఫెయిల్‌ అయ్యాడని తనదైన రీతిలో కామెంట్‌ చేశాడు వర్మ. బాహుబలి టిప్‌ ఆఫ్‌ ద ఐస్‌బర్గ్‌ మాత్రమే బాహుబలి -2 ఐస్‌బర్గ్‌ అని వర్మ అన్నాడు.

ఇప్పుడు బాహుబలి తీసాడు కాబట్టి పద్మశ్రీ అవార్డు ఇచ్చారని, బాహుబలి-2 విడుదలైతే రాజమౌళి బాహుబలియర్‌ అని ఒక ప్రత్యేకమైన అవార్డు ఏదైనా ప్రవేశపెట్టాలని వర్మ రాజమౌళి గొప్పతనాన్ని వివరించాడు.

English summary

Ace Director S.S. Rajamouli got Padamasri award. Ram Gopal Varma comments about this award. Rajamouli got PadmaShri award but i didn't get even Padma.