రాజమౌళికి అసిస్టెంట్ డైరెక్టర్ గా నాని

Rajamouli is playing guest role in Nani movie

05:16 PM ON 5th May, 2016 By Mirchi Vilas

Rajamouli is playing guest role in Nani movie

నాని, రాజమౌళి మధ్య మంచి స్నేహం ఉంది. నానికి ఎప్పటికప్పుడు మంచి సలహాలు, సూచనలు ఇచ్చే అతికొద్ది మంది వ్యక్తుల్లో రాజమౌళి ఒకడు. అంతేకాదు… నానికి ఈగ రూపంలో మంచి హిట్ కూడా ఇచ్చాడు. అలాంటి నాని, రాజమౌళి కలిసి మరో సినిమా చేయబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి… అంతా అది బాహుబలి తర్వాత మూవీ అనుకుంటున్నారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో నాని సినిమా చేయడం లేదు. నాని చేస్తున్న ఓ సినిమాలో రాజమౌళి గెస్ట్ రోల్ పోషిస్తున్నాడు. అదీ సంగతి. ఉయ్యాల-జంపాల సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విరించి వర్మ, నాని కోసం ఓ మంచి కథ రాసుకున్నాడు.

ఈ కథలో నాని, రాజమౌళి నిజీజీవిత పాత్రల్లో కనిపించనున్నారు. అవును… నాని అసిస్టెంట్ డైరక్టర్ గా, రాజమౌళి డైరక్టర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు. సినిమాల్లోకి రాకముందు నాని అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన విషయం చాలా మందికి తెలిసిందే. దిగ్గజ దర్శకుడు బాపు గారి దగ్గర కూడా నాని వర్క్ చేశాడు. ఇక గెస్ట్ రోల్స్ చేయడంలో రాజమౌళికి కూడా కాస్తోకూస్తో అనుభవం ఉంది. చరిత్ర సృష్టించిన బాహుబలిలో కూడా రాజమౌళి ఓ చిన్న పాత్రలో మెరిశారు. కాబట్టి… ఈసారి నాని రిక్వెస్ట్ చేయడంతో జక్కన్న కాదనలేకపోయాడు. త్వరలోనే ప్రారంభంకానున్న ఈ సినిమాలో దర్శకుడిగా నటించడానికి ఒప్పుకున్నాడు.

English summary

Rajamouli is playing guest role in Nani movie. Block Buster director S. S. Rajamouli is playing a director role in Nani movie.