రైతుగా మారనున్న జక్కన్న

Rajamouli is turning as a farmer

11:42 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Rajamouli is turning as a farmer

దర్శకధీర రాజమౌళి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే రాజమౌళి వ్యవసాయంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడు. అవును ఇది నిజం. రాజమౌళి వ్యవసాయం కోసం హైదరాబాద్‌ నగర్‌ శివార్లలో 20 ఎకరాలు భూమి కూడా కొన్నాడట. తాజా సమాచారం ప్రకారం జక్కన్న అక్కడ ఒక ఫార్మ్‌హౌస్‌ నిర్మించాలని అనుకుంటున్నాడు. అందుకోసం తన స్నేహితుడు మరియు ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ని ఫార్మ్‌హౌస్‌ యొక్క నమూనాని డిజైన్‌ చేయమని చెప్పాడట. ఆ 20 ఎకరాల స్థలాన్ని నిజమైన పల్లెటూరిగా కనిపించేలా దానిని తీర్చి దిద్దనున్నాడట. అక్కడ రాజమౌళి మొక్కలు నాటి కాయగూరల్ని పండించాలనుకుంటున్నాడట.

తాజాగా మహేష్‌బాబు కూడా హైదరాబాద్‌ ఓషెన్‌ పార్క్‌ వద్ద 3 ఎకరాలు స్థలం కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాజమౌళి కూడా ఈ బాటలోకే చేరాడు.

English summary

S.S. Rajamouli is turning as a farmer. He bought 20 acres land at Hyderabad outskuts.