రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనేనా?

Rajamouli next movie with Mahesh Babu

06:21 PM ON 19th May, 2016 By Mirchi Vilas

Rajamouli next movie with Mahesh Babu

'బాహుబలి' చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి 2' చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అయితే ఇంతకు ముందు రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో మహేష్ బాబు అభిమానులు పండగ కూడా చేసుకున్నారు. అయితే 'బాహుబలి 2' చిత్రీకరణకు ఎంతో సమయం తీసుకుంటున్న రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు తీస్తాడన్నది ప్రస్తుతం మహేష్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. మహేష్ బాబు కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం పై స్పందిస్తూ రాజమౌళితో సినిమా ఉంటుంది గాని అది ఎప్పుడో తెలియదు, ఇప్పటివరకు ఆయన నన్ను కలవలేదు అని అన్నారు.

మరో వైపు రాజమౌళి కూడా 'బాహుబలి' తరువాత మహేష్ బాబుతో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ తీయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఏదేమైనా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే ఇప్పటి నుండే మహేష్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.

English summary

Rajamouli next movie with Mahesh Babu. S. S. Rajamouli next movie with Super Star Mahesh Babu.