మహాభారత యుద్ధానికి జక్కన్న రెడీ

Rajamouli Ready For Mahabharatam Movie

11:07 AM ON 11th January, 2017 By Mirchi Vilas

Rajamouli Ready For Mahabharatam Movie

టాలీవుడ్ లో ఈ తరంలో ఎందరో దర్శకులున్నారు. అయితే వీళ్ళు తీసే కొన్ని సినిమాలు బాగా ఆడినా, మరికొన్ని బోల్తా కొడతాయి. అయితే ఇప్పటివరకూ ఒక్క ఫెల్యూర్ కూడా చూడని దర్శకుడు టాలీవుడ్ లో వున్నాడు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్.రాజమౌళి. ఎందుకంటే, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి దాకా ఏ సినిమా తీసినా.. దేనికదే ప్రత్యేకం. అపజయమంటే ఏంటో తెలియని డైరెక్టర్ రాజమౌళి. ప్రతి సినిమాకు అంత వైవిధ్యం జోడించి సినిమా తీస్తాడు. అందుకేనేమో ఈ సినిమా శిల్పికి జక్కన్న అని ఎన్టీఆర్ పేరు పెట్టాడు. తాజాగా ఈ జక్కన్న తన చిరకాల వాంఛను మరోసారి వెల్లడించాడు. ఆ చిరకాల వాంఛ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది. అదే ‘మహాభారతం’. అవును బాహుబలి అనుభవాలపై ఏర్పాటు చేసిన సౌత్ కాన్‌క్లేవ్ 2017లో తన మనసులోని బలమైన కోరికను వెల్లడించాడు.

మహాభారత కథను మునుపెన్నడు చూడని విధంగా భారీ స్థాయిలో తెరపై చూపించాలన్నదే తన కోరిక అని చెప్పాడు. అందులో నుంచి ఓ పాత్రను తీసుకున్నా.. ఓ ఉపకథను ఎంపిక చేసుకొన్నా తనను ఎంతగానో ప్రభావితం చేస్తుందని చెప్పాడు. ఓ కథను తెరపై చూపించాలనుకున్నప్పుడు ముందు తనకు అది నచ్చాలని, తర్వాతే ప్రేక్షకులని చెప్పాడు. ప్రస్తుతం తీస్తున్న బాహుబలి సినిమా ప్రభావాన్ని 30 ఏళ్ల తర్వాత కూడా జనం గుర్తుంచుకోవాలని అన్నారు. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఓ కథ ఒరిజినాలిటీ విషయంలో తనకు పెద్దగా మార్కులేమీ పడవని, అమర్ చిత్ర కథల నుంచే తాను ఎక్కువగా స్ఫూర్తి పొందుతానని వివరించాడు.

భాషకు, సినిమాకు సంబంధం లేదని, విజువల్సే కథను, ఎమోషన్లను ప్రేక్షకులకు చేరవేస్తాయని చెప్పిన రాజమౌళి, ఫలానా ప్రాంతం వాళ్లు ఫలానా జోనర్ చిత్రాలే చూస్తారు అనేదానికి తాను పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించాడు. కాగా, బాహుబలి-2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు సినీ శిల్పి జక్కన్న. బాహుబలి సినిమా తీయడం కోసం తన సినిమాలన్నింటినీ ఓ సారి చూసుకున్నానని, అవే తనను ఇంత భారీ సినిమా తీసేలా పురికొల్పాయని వివరించాడు. మరి, తన భావాలను పంచుకున్న జక్కన్న.. మహాభారతాన్ని తెరపై ఎప్పుడు చెక్కేది మాత్రం వెల్లడించలేదు. ఎవరూ చూడని కోణంలో మహాభారత రూపకల్పనకు జక్కన్న రెడీ అవ్వడం అభిమానులకు ఆనందమే కదా.

ఇవి కూడా చదవండి: వామ్మో .. వేలంలో 3 టికెట్లు.. రూ.36 లక్షలట

ఇవి కూడా చదవండి: బన్నీని రౌండప్ చేసిన పవన్ ఫ్యాన్స్ (వీడియో)

English summary

Tollywood Sensational Director S.S.Rajamouli was become famous in all over India by the film Bahubali and now he completed the shooting of Bahubali-2 movie and he said that he will do movies if he likes the story.