రహస్యాలను బయటపెట్టిన జక్కన్న

Rajamouli revealed some secrets about Baahubali 2

12:38 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Rajamouli revealed some secrets about Baahubali 2

బాహుబలి చిత్రానికి ఇటీవలే మరో అవార్డు అందుకున్న జక్కన్న తాజాగా బాహుబలి 2 కి సంబంధించి తన అస్ర్తాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. బాహుబలి 2 మూవీ షూటింగ్ మొదలుపెట్టి దాదాపు ఆరునెలలు గడిచిపోయింది. దీనికి సంబంధించి ఆన్ లైన్ ఏదోఒకటి న్యూస్ చక్కర్లు కొడుతున్నా.. సినీ లవర్స్ నుంచి పెద్దగా పట్టించుకున్న సందర్భం రాకపోవడం, రెస్పాన్స్ లైట్ గా రావడం గమనించిన డైరెక్టర్ రాజమౌళి, ఈ ఉదయం రామోజీ ఫిల్మ్ సిటీ సెట్స్ లో యూనిట్ తో ఆయన చర్చిస్తున్న సిట్యువేషన్ ని క్లిక్ మనిపించి ఓ నాలుగు పిక్స్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

రెండు పిక్స్ యూనిట్ తో ఆయన మాట్లాడుతుండగా, మరో రెండింటిలో ఓ వైపు ప్రభాస్, మరోవైపు రానాలున్నారు. ఇక సందర్భాన్ని పక్కనబెడితే.. ఈ ఉదయం అంటూ టైమ్ సైతం ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ లెక్కన బాహుబలి 2 గురించి రోజు ఇలా యూనిట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తారా? లేదా నార్మల్ గా ఇలా పోస్ట్ చేశాడా అనేది తెలియాల్సివుంది. మొత్తానికి బాహుబలితో పోల్చితే.. సెకండ్ పార్ట్ లో ఉత్సాహం కనిపిస్తోందా లేదా అన్నది తేలాలి.

English summary

Rajamouli revealed some secrets about Baahubali 2