హాలీవుడ్ ఎంట్రీ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

Rajamouli sensational comments on his hollywood entry

12:32 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Rajamouli sensational comments on his hollywood entry

స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో టాలీవుడ్ లో డైరెక్టర్ గా అడుగు పెట్టి ఆ తరువాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి వంటి వరుస విజయాలతో అపజయం అనే మాట తెలియకుండా దూసుకుపోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. 'బాహుబ‌లి' చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పాడు రాజ‌మౌళి. 'బాహుబలి ది బిగినింగ్' చిత్రం ఈ ఏడాది ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన రాజ‌మౌళిని అక్క‌డ మీడియా వాళ్లు మీరు హాలీవుడ్‌లో ఎంట్రీ ఎప్పుడు ఇస్తార‌ని ప్ర‌శ్నించారు.

ఈ ప్ర‌శ్న‌కు మనసులోని అభిప్రాయాన్ని చెప్పేశాడు రాజమౌళి. ‘ఇప్పట్లో అయితే నాకు హాలీవుడ్ లో సినిమా తీయాలన్న కోరిక ఏ మాత్రం లేదు. ప్రస్తుతం నేను 'బాహుబలి 2' తెరకెక్కించడంలో చాలా బిజీగా ఉన్నాను. దీనితో పాటే మరి కొన్ని కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి’ అని తేల్చి చెప్పేసాడు రాజమౌళి. 'బాహుబ‌లి' తొలి భాగంతో 650 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.. రెండో భాగంతో వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవాలన్నది ప్రస్తుతం రాజమౌళి లక్ష్యం అని చెబుతున్నారు. ఇక ఇండియాలోనే అక్బ‌ర్‌, మ‌హారాణా ప్ర‌తాప్‌, అశోకుడు లాంటి చరిత్ర‌ల‌ను కూడా తెర‌కెక్కించాల‌న్న కోరిక‌ ఉందని రాజమౌళి స్పష్టం చేసారు.

English summary

Rajamouli sensational comments on his hollywood entry. S. S. Rajamouli told about his hollywood entry. He is now not interested in Hollywood.