బాహుబలి-2 రిలీజ్‌ డేట్‌ చెప్పి షాకిచ్చిన రాజమౌళి

Rajamouli Shocked Every One By Bahubali Release Date

01:26 PM ON 3rd March, 2016 By Mirchi Vilas

Rajamouli Shocked Every One By Bahubali Release Date

దర్శకధీర ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి'. యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క, తమన్నా హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి ఇందులో ప్రతీనాయకుడి పాత్రలో నటించారు. 2015 సంవత్సరంలో జూలై 10న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించి కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపు ముస్తాబవుతుంది. 2015 డిసెంబర్‌ లో బాహుబలి-2 షూటింగ్‌ ప్రారంభించారు. అయితే 'బాహుబలి' చిత్రం షూటింగ్‌కి రాజమౌళి ఏకంగా రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నాడు. అప్పుడే బాహుబలి-2 కి సంబందించి 40 శాతం షూటింగ్‌ని పూర్తి చేసేశారు. అయితే బాహుబలి సినిమాలోనే 2016 చివరిలోనే 'బాహుబలి-2' వస్తుందని వేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి 'బాహుబలి-2' విడుదల తేదీని అనౌన్స్‌ చేసి అభిమానులకి పెద్ద షాకే ఇచ్చాడు. 'బాహుబలి-2' చిత్రాన్ని 2017 ఏప్రిల్‌ 14న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ తేదీన విడుదల చెయ్యడానికి ఒక కారణముంది. 2017 ఏప్రిల్‌ 14 గుడ్‌ ఫ్రైడే కావడంతో వీకెండ్‌లో మూడు రోజులు శెలవు వస్తుంది. దీనితో ఎక్కువ మంది ఈ చిత్రాన్ని చూస్తారు. అప్పుడు కలెక్షన్లు కూడా బాగా ఎక్కువ వస్తాయని రాజమౌళి ఈ ఆలోచన రచించాడు. అంటే దాదాపు 13 నెలలు పైనే ఈ చిత్రం కోసం ఎదురు చూడాలి. అంత వరకు 'బాహుబలి-2' చిత్రాన్ని చూడకుండా ఉండడం అభిమానులకి నిరాశే అని చెప్తున్నారు.

English summary

Bahubali Movie Director S.S.Rajamouli announced the date of Bahubali-2 movie and shocks everyone.A news came to know that S.S.Rajamouli was thinking to release this movie in 2017 April 14th.