ఖైదీ నెంబర్ 150లో రాజమౌళి కొడుకు!

Rajamouli son Karthikeya edited the Khaidi number 150 movie motion poster

10:39 AM ON 24th August, 2016 By Mirchi Vilas

Rajamouli son Karthikeya edited the Khaidi number 150 movie motion poster

చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ నెంబర్ 150 అని తెలుసు కదా. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరి ఇందులో రాజమౌళి కొడుకు కార్తికేయ రోలేంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. చిరంజీవి బర్త్ డే సందర్భంగా నిమిషం నిడివిగల వీడియో ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేసింది కొణెదల ప్రొడక్షన్. చిరంజీవికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే, ఈ వీడియో తయారు చేసింది ఎవరో కాదు రాజమౌళి కొడుకు కార్తికేయ. అన్నట్లు కార్తికేయ షోయింగ్ బిజినెస్ పేరుతో ఎప్పటినుండో ఓ కంపెనీ నడుపుతున్నాడట.

నాగార్జున కొడుకు అఖిల్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన కార్తికేయ, బాహుబలి మేకింగ్ వీడియో, అఖిల్ మూవీ టీజర్ ఇలా చాలా సినిమాల టీజర్స్ ని క్రియేటివ్ గా చేశాడు. సోషల్ మీడియాలో దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇప్పుడు చిరు బర్త్ డే వీడియో వంతైందని ఫిల్మ్ నగర్ లో న్యూస్ హల్ చల్ చేస్తోంది. మొత్తానికి ఖైదీ నెంబర్ 150తో వర్క్ చేస్తున్నందుకు కార్తికేయ హ్యాపీగా ఫీలవుతున్నాడట.

English summary

Rajamouli son Karthikeya edited the Khaidi number 150 movie motion poster