ఆ రూమర్లు రాజమౌళి తనయుడికి తెగ నచ్చేశాయి..

Rajamouli son Karthikeya likes that rumours

05:14 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Rajamouli son Karthikeya likes that rumours

'బాహుబలి 2' ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా టూర్ వెళ్లిన జక్కన్న.. అక్కడ సుదీర్ఘమైన వెకేషన్ లో ఉన్నాడు. ఈ సమయంలో వచ్చిన ఓ రూమర్.. రాజమౌళి కుటుంబాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. జక్కన్న కుమారుడు కార్తికేయ.. దర్శకుడిగా అరంగేట్రం ఖాయమైందని ఓ ప్రాజెక్టును డైరెక్ట్ చేయనున్నాడంటూ.. ఓ బడా న్యూస్ ఛానల్ పెద్ద ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాతో కార్తికేయ దర్శకత్వ అరంగేట్రం చేయనున్నాడన్నది ఆ ఛానల్ ప్రసారం చేసిన ఎపిసోడ్ సారాంశం.

ఎన్టీఆర్ ఇందుకు ఒప్పకుంటే రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని తలపెట్టారని కూడా చెప్పారు. అయితే.. ఈ కుర్రాడు ఇప్పుడు ఈ వార్తల పై స్పందించాడు. 'వావ్ కొన్ని రూమర్లు భలే ఎక్సైటింగ్ గా ఉంటాయి.' అంటూ ట్వీట్ చేశాడు కార్తికేయ. కార్తికేయ ట్వీట్ తో ఎన్టీఆర్ తో సినిమా అనేది రూమర్ అని తేలిపోయింది. ఇప్పటికైతే ఇది రూమర్ అన్న మాట నిజమే కానీ.. నిజానికి ఇతడు ఫ్యూచర్ లో డైరెక్షన్ చేయడం అనే మాట మాత్రం వాస్తవమే. ఈ ఫీల్డ్ పై కార్తికేయకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాకపోతే ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ అన్నదే.. అసలు వ్యక్తి కూడా భలేగా ఎంజాయ్ చేసే రూమర్..

English summary

Rajamouli son Karthikeya likes that rumours. Super hit director S. S. Rajamouli son Karthikeya likes that rumours in channel.