బాహుబలి -2 తర్వాత 'గరుడ'

Rajamouli To Direct Garuda After Bahubali 2

10:31 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Rajamouli To  Direct Garuda After Bahubali 2

ఎన్టిఆర్ - రాజమౌళి కాంబినేషన్ అంటే అభిమానులకు పండగే. వీరిద్దరి కలయికలో సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. ఆ మధ్య వరుస సినిమాలు వచ్చి , హిట్ కొట్టాయి. అయితే హ్యాట్రిక్‌ కొట్టిన ఈ జోడీ మధ్య ఇంత గ్యాప్ రావడంతో అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది. అసలు ఎన్టిఆర్ కి స్టార్డం రావడానికి జక్కన్న కారణం అనచ్చో. ఎన్టీఆర్‌కి తొలి హిట్‌ ఇచ్చింది రాజమౌళినే కదా. ‘స్టూడెంట్‌ నెం.1’తో ఎన్టీఆర్‌ కి మాస్‌ ఫాలోయింగ్ అద్దిన రాజమౌళి, ఆ తరవాత ‘సింహాద్రి’తో ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఎన్టిఆర్ సినిమా వస్తే,రికార్డులు హోరెత్తడం ఖాయమని ‘సింహాద్రి’ నిరూపించేలా జక్కన్న చేసాడు.ఇక అప్పటివరకు బొద్దుగా వున్న తారక్‌ ని ‘యమదొంగ’లో స్మార్ట్ గా చూపించడానికి తపించి సాధించాడు. ఇక ఆ సినిమాలో ఎన్టీఆర్‌ యముడిగా ‘ఎనీ డౌట్‌’ అంటూ యమలోకంలో ప్రకంపనాలు సృష్టించాడు. పౌరాణిక పాత్రల్లో ఇమిడిపోయే నటుడు తానే అని ఈ ‘యమదొంగ’ తో ఎన్టిఆర్ చాటిచెప్పాడు.. అప్పటి నుంచీ మళ్ళీ వీరిద్దరి మధ్యా సినిమా లేదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అంటూ అభిమానులు ఆరాట పడిపోతున్నారు.‘జక్కన్న ఎప్పుడంటే అప్పుడే..’ అంటూ ఎన్టిఆర్ కూడా చెబుతూ వచ్చాడు. అయితే ఆ సుభ ఘడియలు ఇప్పుడు వచ్చాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్‌ కోసమే ‘గరుడ’ అనే కథని సిద్ధం అయ్యిందని అంటున్నారు.‘బాహుబలి 2’ తరవాత రాజమౌళి ఈ చిత్రాన్నేపట్టా లెక్కించే అవకాశాలున్నాయన్న మాట వినిపిస్తోంది.మరి గరుడతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. అంచనాలు అయితే భారీ గానే వున్నాయి.

English summary

Presently director S.S.Rajamouli was busy with his next film Bahubali-2 and recently a news came to know that he was going to make "GARUDA" movie with young tiger NTR as his next project.