'ఊపిరి' చూశాక నేను తప్పని తెలిసింది

Rajamouli tweeted about Oopiri movie

10:29 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Rajamouli tweeted about Oopiri movie

'ఊపిరి' చిత్ర బృందం పై ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం విడుదలైన 'ఊపిరి' చిత్రాన్ని వీక్షించిన జక్కన్న సినిమా పై తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నాకు ఇష్టమైన చిత్రాల్లో 'ఇన్‌టచ్‌బుల్స్‌' ఒకటి. ఫ్రాంక్‌గా చెప్పాలంటే వంశీ చిత్రాన్ని ఈ స్థాయిలో తీస్తారని అనుకోలేదు. థ్యాంక్స్‌ వంశీ... నేను తప్పు అని నిరూపించినందుకు. భారతీయులకు తగినట్టు సినిమాను తీసిన విధానం దాని స్థాయిని పెంచింది. కార్తీ చాలా బాగా నటించాడు. నాగార్జున నిజమైన పాత్‌ బ్రేకర్‌. నిర్మాత పీవీకి, యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు. 'ఊపిరి' నిజంగానే ఓ మంచి వినోదాత్మక చిత్రం, అది మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతుంది.

మిస్‌ కావద్దు... అంటూ జక్కన్న తన ట్వీట్‌ లో పేర్కొన్నాడు. ‘ఇన్‌టచ్‌బుల్స్‌’ చిత్రానికి రీమేక్‌గా 'ఊపిరి' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెల్సిందే.

English summary

Rajamouli tweeted about Oopiri movie. S. S. Rajamouli tweeted in his official twitter account about Oopiri movie.