హీరో కావాలని టీనేజ్ లో అలా చేసేవాడిని: రాజమౌళి

Rajamouli want to became hero in his teenage

11:59 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Rajamouli want to became hero in his teenage

రణధీర్, రుక్ సర్ మీర్ జంటగా ఎస్.ఎస్. కాంచీ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం షో టైమ్. రమారీల్స్ పతాకం పై జాన సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆదివారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఫస్ట్ లుక్ ను కె. రాఘవేంద్రరావు, టీజర్ ను రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ టీనేజ్ లో ఉండగా హీరో కావాలనే తపనతో గుళ్లో పూజలు చేసేవాడిని. ఆ విషయాన్ని సిగ్గుతో ఎవరికీ చెప్పేవాడిని కాదు. ఓసారి కాంచీ అన్నయ్య వచ్చి ఏమవుతావురా అనడిగితే సినిమా హీరోనవుతా అని చెప్పా. నువ్వు అనుకున్నది సాధించాలంటే ఇండస్ట్రీలో ఉండాలి.

ఇక్కడుంటే పని జరగదని చెప్పి నాకు గైడ్ లా వ్యవహరించారు. ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఎప్పుడో దర్శకుడు కావాలి. ఇప్పటికి సమయం వచ్చింది అని వివరించారు. చక్కని థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు కాంచీ అన్నయ్య. టీజర్, పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా అని అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ నా సక్సెస్ లో కీరవాణి, రాజమౌళి తండ్రులకు చాలా భాగముంది. కీరవాణి, రాజమౌళి సక్సెస్ చూస్తుంటే ఓ గురువుగా చాలా గర్వపడుతుంటా. దర్శకుడిగా పరిచయమవుతున్న కాంచీ కూడా మంచి స్థాయికి చేరుకోవాలి అని అన్నారు.

దర్శకత్వం నా డ్రీమ్ కాదు. కానీ ఎప్పటి నుంచో చెయ్యాలనుంది. సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుని దర్శకుడిగా మారుతున్నా అని ఎస్.ఎస్ కాంచీ తెలిపారు. ఇండియన్ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలనేది నా ఆశ. అందుకే అక్కడి వారితో భాగస్వామ్యం కుదుర్చుకున్నా. జాకీఛాన్ తో ఓ సినిమా చేయబోతున్నా అని సుధీర్ పూదోట చెప్పారు.

English summary

Rajamouli want to became hero in his teenage