ఇండియన్ ఆఫ్ ది ఇయర్ గా జక్కన్న

Rajamouli Wins Indian Of The Year Award

01:19 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Rajamouli Wins Indian Of The Year Award

తెలుగు సినీ చరిత్రలో జక్కన్న మరో మైలు రాయి అధిగమించాడు ఎస్.ఎస్.రాజమౌళి... బాహుబలి సినిమాతో తెలుగు దర్శకుల స్థాయిని అమాంతం పెంచేసి, టాలీవుడ్ కి ఎనలేని కీర్తి ఆపాదించిన జక్కన్న "ఇండియన్ ఆఫ్ ది ఇయర్" గా నిలిచాడు. బాహుబలితో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజమౌళి తాజాగా ఈ అవార్డు అందు కావడంతో ఆనందానికి అవద్దుల్లేవ్. ప్రతి ఏటా సీఎన్ ఎన్ ఐబీఎన్ సంస్థ నిర్వహించే అవార్డుల్లో భాగంగా బాహుబలి చిత్రానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2015 అవార్డుల్లో ఎంటర్ టైన్ మెంట్ విభాగానికి ప్రతిష్టాత్మక అవార్డు జక్కన్న అందుకున్నాడు .గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. రణవీర్ సింగ్, కంగనా రనౌత్ లు ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో స్పెషల్ కేటగిరి అవార్డులను గెలుచుకున్నారు. ఇక ఈ పురస్కారం తనకు దక్కడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన రాజమౌళి, స్పందిస్తూ బాహుబలి టీమ్ కష్టానికి ప్రతిఫలంగా ఈ అవార్డు నాకు లభించింది. అందుకే ఈ అవార్డును బాహుబలి టీమ్ కు అంకితం ఇస్తున్నా..అని ప్రకటించాడు.

బాహుబలికు కొనసాగింపుగా తెరకెక్కుతున్న బాహుబలి ది కంక్లూజన్ ఏప్రిల్ లో విడుదల చేస్తామని, అప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం తెలుస్తుందని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ఓటమెరుగని విక్రమార్కుడు జక్కన్న తెలిపాడు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న బాహుబలి ,జాతీయ స్తాయికో తొలిసారి ఉత్తమ చిత్రంగా నిల్చి అరుదైన రికార్డు సృష్టించింది.

English summary

Tollywood Top Director S.S. Rajamouli who became famous with Bahubali movie was won CNN's "Indian Of The Year Award" and today he was presented with that Award.