యూట్యూబ్‌లో 'బాహుబలి-2' వీడియో లీక్‌.. రాజమౌళికి షాక్‌!

Rajamouli worried about that phone call in mid night

01:42 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Rajamouli worried about that phone call in mid night

దర్శకధీర ఎస్‌.ఎస్‌. రాజమౌళిని ఒకరు ఫోన్‌ చేసి భయపెట్టారట. ఇంతవరకు రాజమౌళి ఎప్పుడూ పడని టెన్షన్‌ ఆ ఒక్క ఫోన్‌కాల్‌ తో భయపడి రాత్రంతా నిద్రపోలేదట. ఇంతకీ రాజమౌళి ఎందుకు అంతలా భయపడ్డాడు? అసలు రాజమౌళి అంత పెద్ద తప్పు ఏం చేశాడు? అనే ప్రశ్నలు మీలో మెదులుతున్నాయి కదా? అసలు విషయంలోకి వస్తే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాజమౌళి కి ఫోన్‌ చేసి సార్‌ మీరు కేరళలో షూట్‌ చేసిన 'బాహుబలి-2' కి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో విడుదలయ్యాయి అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడట. దీనితో రాజమౌళి కి ఒకటే టెన్షన్‌ మొదలైందట. ఏం చెయ్యాలో కాసేపు అర్ధం కాక సతమతమైన రాజమౌళి వెంటనే తన టీమ్‌కి ఫోన్‌ చేసి మీటింగ్‌ ఏర్పాటు చేశాడట.

జరిగిన విషయం చెప్పి యూట్యూబ్‌లో ఆ లింక్స్‌ని తియ్యించేసే ప్రయత్నం చేశాడట. కానీ ఆ అపరిచితుడు చెప్పినట్లు యూట్యూబ్‌లో అటువంటి లింక్స్‌ ఏమీ లేవట. ఎవరో కావాలని చేసి ఉంటారని అందరూ రిలాక్స్‌ అయ్యారట.

English summary

Rajamouli worried about that phone call in mid night. One unknown person make a call to Rajamouli in mid night and shocked with a wrong news.