బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్

Rajasekhar To Act As Villain In Balayya 100th Film

04:38 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Rajasekhar To Act As Villain In Balayya 100th Film

అది బాలీవుడ్ అయినా , టాలీవుడ్ అయినా ఒక హీరో కి హిట్ వస్తే, ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. తర్వాత చిత్రానికి భారీ అంచనాలు వస్తాయి. ఇక డిక్టేటర్ బ్లాక్ బస్టర్ హిట్ తో నందమూరి బాలకృష్ణకి తర్వాత సినిమాకి విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అందునా బాలయ్య చేస్తున్న చిత్రం కూడా 100 వది కావటంతో .రోజు రోజు కి అంచనాలు పెరుగుతున్నాయి .

అందరికీ తెల్సిన ఓ పాత ముఖాన్ని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు వినికిడి. ఇప్పటికే లేడీస్ కి నచ్చిన హీరోగా ముద్రపడిన జగపతిబాబు విలన్ గా మారి మంచి విజయాలు నమోదుచేసుకున్నాడు. లెజెండ్ ,పిల్ల నువ్వు లేని జీవితం ,నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలు జగపతికి మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. ఇదే కోవలో మరో నటుడుని విలన్ రాబోతున్నాడు. అతనెవరో కాదు, ఇప్పటి దాకా హీరోగా ఎన్నో విజయాలు అందుకుని " యాంగ్రీ యంగ్ మ్యాన్ " గా ముద్ర పడిన డాక్టర్ .రాజశేఖర్ అట. బాలయ్య 100వ సినిమాలో డాక్టర్ రాజశేఖర్ కూడా నటిస్తున్నట్లు తాజా కబురు మోసుకొస్తున్నారు. రాజశేఖర్ మాత్రం కీలకమైన విలన్ పాత్ర వేస్తున్నట్లు హాట్ టాక్ నడుస్తోంది. .అంతేకాక ఈ బాలయ్య చిత్రం లో విలన్ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత బాలయ్య తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా విలన్ అవతారం ఎత్తడానికి డాక్టర్ రాజశేఖర్ ఒప్పుకున్నాడట ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు సంప్రదించినా విలన్ గా చేయనని చెప్పేసిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్, బాలయ్య కోసం మాత్రం విలన్ గా అంగీకరించాడట. జగపతి లాగా రాజశేఖర్ కూడా విలన్ గా మారతాడా ? ఒకవేళ నటిస్తే, మంచి విజయాలు అందుకుంటాడా? వేచిచూడాలి.

కాగా బాలయ్య 100 సినిమా బోయపాటితో అని కొందరు, అనిల్ రావిపూడితో అని మరికొందరు అనే చర్చ నడిచినా , చివరకు బాలయ్య సన్నిహితులు మాత్రం ఆదిత్య 369 రీమేక్ గా ఆదిత్య 999 ని తెరకెక్కిస్తున్నారు అని, దీనికి సింగీతం శ్రీనివాస రావే దర్శకులని అంటున్నారు. ఇక మోక్షజ్ఞ రాకుమారుడిగా నటిస్తున్నాడని ఇప్పటికే స్వయంగా బాలయ్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం తెల్సిందే. అంతే కాక శ్రీ కాంత్ , తాప్సి కూడా ఇందులో నటిస్తున్నారట. శ్రీకాంత్ చిన్న పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు.

English summary

Presently Nandamuri Balakrishna was busy with his 100th film and news came to know thatVeteran Hero Raja Sekahr was going to act as villain in Bala Krishna's 100th film.Raja Sekhar was also accepted the offer to act as villain in Balayya's 100th film