రాజశేఖర్ విలన్

Rajasekhar To Act As Villain In Teja Film

02:39 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Rajasekhar To Act As Villain In Teja Film

విలన్ టైటిల్ తో సినిమా చేసిన హీరో డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు నిజంగానే విలన్ పాత్రలో నటించబోతున్నాడు. కథానాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా విజృంభిస్తుండడం చూస్తూనే ఉన్న నేపధ్యంలో ఇటీవల హీరో జగపతి బాబు విలన్ అవతారం ఎత్తగా, ఇప్పుడు రాజశేఖర్‌ కూడా అదే బాట పట్టబోతున్నాడు. తేజ దర్శకత్వంలో వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తెరకెక్కిస్తోన్న ఓ చిత్రంలో రాజశేఖర్‌ విలన్గా నటించడానికి అంగీకరించాడు. పి.సత్యనారాయణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంతా నూతన నటీనటులేనట. 'ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రకెంతో ప్రాధాన్యం ఉంది. రాజశేఖర్‌ అయితే నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తారనిపించింది’’ అని చిత్రబృందం అంటోంది. త్వరలోనే సెట్స్ మీదికి వెళ్ళే ఈ చిత్రం పేరు కూడా వేల్లదికానుంది.

English summary

Anger young man Rajasekhar has played villain characters of his carrier in earlier days. Hero Rajasekhar’s previously released movie Gaddam Gang was failure at box office.Now Rajasekhar was going to act as Villain in director Teja next film.Teja was going to make this film with all new actors.This movie was going to be produced by P.Satyanarayana Reddy