నామినేషన్ కి కాదు.. పోలీస్ స్టేషన్ కి

Rajayya Arrested

06:15 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Rajayya Arrested

చేతివరకు వచ్చిన ముద్ద.. నోటికందకపోవడం అంటే ఇదేనేమో..వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి గా నామినేషన్ వేయాల్సిన సిరిసిల్ల రాజయ్యా పోలీస్ కేసులో ఇరుక్కున్నారు. రాజయ్యా కోడలు సారిక , మనవళ్ళు అభినవ్(7),యోన్(3),శ్రీ యోన్(3) సజీవ దహనం కావడంతో బుదవారం నామినేషన్ వెయ్యాల్సిన రాజయ్యా పోలీసు విచారణను ఎదుర్కుంటున్నారు రాజయ్యాతో పాటు భార్య, కుమారుడు అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాజయ్యా కోడలు సారిక , మనవాళ్ళ సజీవ దహనం..హత్యో , ఆత్మ హత్యో తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.కోడలు సారిక కుటుంభసబ్యుల పిర్యాదు మేరకు రాజయ్యా కుటుంభాన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు . ఈ పరిణామాలతో సర్దుకున్న కాంగ్రెస్ ..కొత్త అభ్యర్ధి గా సర్వే సత్యనారాయణ ను ప్రకటించింది.దీనితో రాజయ్యకు నామినేషన్ తో పాటు ఎన్నికల్లో పోటి చేసే అవకాశం చేజారినట్లే.

English summary

Siricilla Rajayya Arrested because the case filed against him..Along With Rajayya his wife and his son also were areested and send to jail.