మహేష్ తండ్రి పాత్రలో రజినీకాంత్?

Rajinikanth Considered For Mahesh Babu Father In Brahmotsavam

10:41 AM ON 19th May, 2016 By Mirchi Vilas

Rajinikanth Considered For Mahesh Babu Father In Brahmotsavam

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు సంబంధించిన ఒక హైపోథెటికల్ టాపిక్ ఇది. వాస్తవానికి ఈ సినిమాలో మహేష్ తండ్రిగా సత్యరాజ్ నటించాడు. ఐతే ఆ పాత్రలో రజినీకాంత్ నటించి ఉంటే ఎలా ఉండేదో ఓసారి ఊహించుకోండి..? అవును ఇలాంటి వయొలెంట్ ఆలోచన శ్రీకాంత్ అడ్డాలకు వచ్చిందట . ముందు నిర్మాత పీవీపీకి కథ చెప్పినపుడు ఈ పాత్రను రజినీకాంత్ తో చేయిస్తే ఎలా ఉంటుందా అని అడిగాడట అతను. అయినా ఇలాంటి క్లాస్ సినిమాలో రజినీ లాంటి మాస్ హీరో.. సాఫ్ట్ గా ఉండే ఫాదర్ క్యారెక్టర్ చేస్తారని ఎలా అనుకున్నారో ఏంటో? బహుశా ఈ సందేహంతోనే ఆ ఆలోచన పక్కనబెట్టేసినట్లున్నారు. కానీ పెదరాయుడులో మోహన్ బాబు తండ్రిగా రజనీ వేసిన విషయం కూడా ప్రస్తావించినా, ఈ ప్రపోజల్ పక్కన పెట్టేసారట.

ఇవి కూడా చదవండి:పవన్ గురించి బన్నీ అలా ఎందుకన్నాడో క్లారిటీ ఇచ్చేసాడు(వీడియో)

అంతేకాదండోయ్ రజినీతో పాటు ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ బాబాయిగా నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు కూడా మహేష్ ఫాదర్ క్యారెక్టర్ కోసం పరిశీలించారట. ఐతే చివరికి నిర్మాత పీవీపీ ఇష్టప్రకారం సత్యరాజ్ ను ఎంపిక చేసుకున్నారట. ఈ విషయాన్ని పీవీపీనే స్వయంగా వెల్లడించారు. ‘‘బ్రహ్మోత్సవం సినిమాకు అత్యంత సవాలుగా నిలిచింది నటీనటుల ఎంపికే. చాలామంది ఆర్టిస్టులుండటంతో అందరి ఫొటోలతో ఓ ఆల్బమ్ తయారు చేసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరినే సంప్రదించాం. ఐతే మహేష్ తండ్రి పాత్ర విషయంలో చాలా తర్జన భర్జనలు నడిచాయి. రజినీకాంత్..మోహన్ లాల్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ నాకైతే సత్యరాజే కరెక్ట్ అనిపించింది. ఆయన్నే ఫైనల్ చేశాం’’ అని పీవీపీ వివరించారు. మొత్తానికి ఈ ప్రయోగం ఎప్పుడో అప్పుడు ఆచరణలోకి రావచ్చేమో..

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ చెప్పులు తొడిగింది ఎవరికంటే ...

ఇవి కూడా చదవండి:మళ్లీ టాప్ లేపిన రాధిక ఆప్టే(వీడియో)

English summary

Mahesh Babu's Brahmotsavam movie Producer PVP has said some interesting things about Brahmotsavam movie and he said that Director Srikanth Addala was suggested Rajinikanth for Mahesh Babu's Father role in Brahmotsavam movie but instead of him Satyaraj was taken into consideration.