రజనీ హాస్పటల్‌లో ఎందుకు చేరినట్టు ?

Rajinikanth Discharged From MIOT Hospital

05:54 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Rajinikanth Discharged From MIOT Hospital

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రెండు పెద్ద చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి 'కబాలి' కాగా, మరొకటి 'రోబో 2.0'. అయితే ఈ రెండు చిత్రాల కోసం మలేషియా మరియు ఇతర దేశాలకి వరుస పెట్టి తిరగడంతో రజనీ కాస్త నీరసపడ్డట్లు సమాచారం. అందుకే రెగ్యులర్‌ చెకప్‌ కోసం రజనీ ఫిబ్రవరి 22 న చెన్నైలోని మద్రాస్‌ ఇన్‌స్టిట్యూబ్‌ ఆఫ్‌ ఆర్దోపడెక్స్‌ హాస్పటల్‌ లో చేరారు. అయితే రజనీ కాస్త నీరసంగా ఉండడంతో 2 వారాలు రెస్ట్‌ తీసుకోమని డాక్టర్లు సూచన ఇచ్చి హాస్పటల్‌ నుండి డిశ్ఛార్జ్‌ చేసినట్లు సమాచారం. మార్చి రెండో వారంలో రజనీ 'రోబో 2.0' చిత్రం కోసం వేసిన భారీ సెట్‌లో ఒక భారీ ఫైటింగ్‌ కోసం అక్షయ్‌ కుమార్‌తో తలపడాల్సి ఉంది. కరెక్ట్‌ గా రెండు వారాలు టైమ్‌ ఉండడంతో రజనీ రెస్ట్‌ తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

English summary

Superstar Rajinikanth was reportedly admitted in MIOT hospital.Doctors advised Rajini to have some rest for a couple of weeks hence the actor will resume work by the second week of March and he will immediately join the shoot for the fight sequence against Bollywood fame, Akshay Kumar for .directed by Shankar.