రజనీ కుటుంబం కదిలింది.....

Rajinikanth Family Tour To America

03:41 PM ON 27th May, 2016 By Mirchi Vilas

Rajinikanth Family Tour To America

వేసవి కాలంలో కుటుంబ సమేతంగా టూర్లకు వెళ్ళడం హీరోలకు అలవాటే. అదే కోవలో కబాలి సినిమా షూటింగ్ పనులు పూర్తవటంతో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబ సమేతంగా అమెరికాకు ప్రయాణమయ్యాడు. ఈ వేసవి సెలవులను ఆయన కుటుంబ సభ్యులతో అమెరికాలోనే గడుపుతాడు. రజనీకాంత్ తో పాటు ఆయన అల్లుడు, యువనటుడు ధనుష్, పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా అమెరికా వెళ్ళాడు. కళైపులి ఎస్.థాను నిర్మిస్తోన్న కబాలి సినిమా షూటింగ్ పనులన్నీ ఇటీవలే ముగిశాయి. ఈ చిత్రం జూలైలో విడుదల చేయటానికి సన్నాహాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతోపాటు రజనీకాంత్ రెండు రోజులకు ముందు అమెరికాకు బయల్దేరి వెళ్ళగా, ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా వెళ్లారని తెలుస్తోంది. కబాలి చిత్రం తర్వాత రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 2.0 చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. తదుపరి షెడ్యూల్ జూన్ రెండో వారంలో ప్రారంభం కానుంది. అందుకే ఈ గ్యాప్‌ లో అమెరికాలో రెండు వారాలపాటు గడిపి, జూన్ మొదటివారంలో తిరిగిరానున్నట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:దేవుడా! ఇలాంటి బూతు ట్రైలర్ ఎప్పుడూ చూసి ఉండరు

ఇవి కూడా చదవండి:ముసలి హీరోతో లిప్ లాక్ కి సై అన్న అలియా!

English summary

South Super Star Rajinikanth was presently completed the shooting of Kabali and Robo 2.0 movie schedule and now he went to tour for USA along with his family members.