కబాలి ముగింపు విషాదమా లేక మార్పు కోరుతున్నారా?

Rajinikanth finalized Kabali climax

03:30 PM ON 20th July, 2016 By Mirchi Vilas

Rajinikanth finalized Kabali climax

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'కబాలి' పై భారీ అంచనాలు వున్నాయి. ఈనెల 22న విడుదల కానున్న కబాలి విషయంలో అప్పుడే భిన్న వాదనలు వినవస్తున్నాయి. ఈ సినిమా ముగింపు మీద చర్చ నడుస్తోందట. సంతోషంగా ముగిసే కథలనే అత్యధిక ప్రేక్షకులు ఇప్పటి వరకు ఇష్టపడుతున్నారు. అటువంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటున్నాయి. 'కబాలి' డిఫరెంట్ మూవీ అంటున్నారు. ఇప్పటికే నింగి, నేల, నీరు... తేడాలేవీ లేకుండా, ఎక్కడ చూసినా కబాలి మారుమోగిపోతోంది.

ప్రచారానికి దీటుగా ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. అమెరికాలో సైతం అప్పుడే టికెట్స్ అయిపోయాయి కూడా. కబాలి కోసం ఊపిరిబిగపట్టి జనాలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ ఫిల్మ్ క్లైమాక్స్ విషయంలో ఏదో తెలియని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంప్రదాయానికి భిన్నంగా కబాలి ముగుస్తుందంటున్నారు. కబాలి కథ విషాదాంతమవుతుందని తెలుస్తోంది. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు పరిశీలిస్తే తెలుస్తుంది. 'నేనేం రాజీ పడలేదు. నా గత ప్రాజెక్టుల్లాగానే కబాలిని కూడా రాజీ పడకుండా తెరకెక్కించా'. రియలిస్టిక్ ఫీలింగ్ కలిగేలా తీర్చిదిద్దా అని పా. రంజిత్ అంటున్నారు.

క్లైమాక్స్ గురించి కూడా సూచనప్రాయంగా ప్రస్తావిస్తూ.. సినిమాపై నిర్మాత కలైపులి ఎస్. థాను, రజనీకాంత్ కుమార్తె సౌందర్య సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అయితే క్లైమాక్స్ విషయంలోనే కాస్త ఆలోచించారని, ముఖ్యంగా సినిమా సరదాగా ముగియాలని వారు కోరుకున్నారన్నారు. క్లైమాక్స్ విషయంలో పా. రంజిత్ కు రజనీకాంత్ అండగా నిలిచినట్లు తెలుస్తోంది. ముగింపును ఎవరి కోసమూ మార్చవద్దని, అది బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందని రజనీకాంత్ ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కబాలి విషాదాంతమవుతుందనే ఊహాగానాలకు మరింత ఆస్కారం ఏర్పడింది. చూద్దాం విభిన్నతకు మారుపేరైన రజనీ తాజా మూవీ కబాలి ఎలా ఉంటుందో చూద్దాం.

English summary

Rajinikanth finalized Kabali climax