చిరు 150వ సినిమాలో రజనీకాంత్‌ 

Rajinikanth in Chiranjeevi 150th film

11:24 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Rajinikanth in Chiranjeevi 150th film

మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు 8 సంవత్సరాలుగా సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తన తనయుడు రామ్‌ చరణ్‌తేజ్‌ నటించిన మగధీర, బ్రూస్లీ చిత్రాల్లో గెస్ట్‌ రోల్స్‌లో కనిపించారు. అయితే చిరు 150వ చిత్రం గురించి చాలానే వినిపించాయి. వీటికి స్పష్టత ఇస్తూ తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'కత్తి' రీమేక్‌లో చిరు 150వ చిత్రం ఉంటుందని, దానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తారని ఈ చిత్రానికి రామ్‌ చరణ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నానని తానే స్వయంగా వెల్లడించాడు. ఈ విషయాన్ని ప్రకటించి దాదాపు రెండు నెలలు కావొస్తుంది కానీ ఇంకా ఈ చిత్రం సెట్స్‌పైకి పోలేదు.

అయితే చిరంజీవి 150వ చిత్రంలో నటించేందుకు సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది స్టార్‌ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇందులో కొంతమందిని చిరంజీవి ఇప్పటికే ఫైనల్‌ చేశాడని సమాచారం. ఇప్పుడు తాజాగా సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇందులో నటించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో చిరంజీవి-రజనీకాంత్‌ ఇద్దరూ కలుసుకున్నప్పుడు మాటల సందర్భంలో రజనీనే స్వయంగా నటిస్తానని అడగడంతో చిరు కాదనలేకపోయాడట. అంతేకాదు రజనీ ఇందులో కేవలం సెకన్ల పాటు కాకుండా 5 నిముషాలు పాటు కనిపిస్తారని సమాచారం.

English summary

South Indian Super Star Rajinikanth want to act in Chiranjeevi 150th film.