'కబాలి'లో రజనీ వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం!

Rajinikanth Kabali costumes is on auction

10:44 AM ON 17th August, 2016 By Mirchi Vilas

Rajinikanth Kabali costumes is on auction

ఇది కొత్తేమి కాదు... హీరోలు వాడిన దుస్తులు, వస్తువులు, బైక్ లు ఇలా అన్నీ వేలం వేసి డబ్బు రాబట్టడం చాలా సినిమాలకు జరిగింది. కానీ సూపర్ స్టార్ రజనీ కాంత్ బట్టలు వేలం వేయడం అంటే మాటలు కాదు. సూపర్ స్టార్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన కబాలి సినిమా భారీ ఫ్లాప్ ను మూట గట్టుకోవడంతో ఇబ్బందులు తలెత్తినట్లు వినిపిస్తోంది. ఈ మూవీ విడుదలకు ముందు భారీ హైప్ ను పెంచిన ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో భారీ నిరాశేనే మిగిల్చింది. ఇప్పుడు కబాలి సినిమాలో రజనీ వాడిన డ్రెస్ లను వేలం వేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్య సినిమాల్లో స్టార్ హీరోలు వాడిన బైక్ లను, కార్ లను, డ్రెస్ లను, ఆయుధాలను వేలం వేసి ఆ డబ్బులను సేవా కార్యక్రమాలకు వినియోగించడం చూస్తున్నదే, అదే కోవలో ఇప్పుడు కబాలి కాస్ట్యూమ్స్ వేలానికి రానున్నాయి. అయితే ఈ డబ్బులను సామాజిక సేవకు వినియోగిస్తారో లేదా, బడ్జెట్ ను బ్యాలెన్స్ చేయడానికి వాడతారో అప్పుడే చెప్పడం కష్టం. త్వరలోనే ఈ వేలాన్ని ప్రకటిస్తారట, మరి కబాలి డ్రెస్ కొనడానికి ఎంతమంది రజనీ ఫాన్స్ పోటీ పడతారో చూడాలి. పాపం నష్టం పూడ్చుకోడానికి బట్టలు సైతం అమ్మేస్తున్నారు అంటూ కామెంట్స్ పెట్టేస్తున్నారు.

English summary

Rajinikanth Kabali costumes is on auction