రజినీ అభిమానులకు చేదు వార్త

Rajinikanth Kabali Postponed Again

11:34 AM ON 30th June, 2016 By Mirchi Vilas

Rajinikanth Kabali Postponed Again

రజినీకాంత్ అభిమానులకు చేదు వార్త. ఇటీవల సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నటించిన చిత్రం ‘కబాలి’, ఈ సినిమా విడుదల కోసం కేవలం రజినీ అభిమానులే కాకుండా సినీ అభిమానులందరూ క‌ళ్లుకాయ‌లు కాచేలా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటే రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాల్లోవింగ్ అటువంటిది. కబాలి సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్ టీజర్స్‌తో ఈ సినిమా పై అమాంతం హైప్ ను పెంచేశారు. ఇంతటి భారీ అంచనాలు పెట్టుకున్న రజనీ అభిమానులకు మరో చేదువార్త.

ఇది వరకే పలుసార్లు వాయిదా పడ్డ కబాలి సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింది. తొలుత ఎలా అయినా జులై 15 న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేసిన ఈ చిత్ర యూనిట్. కొన్ని అనివార్య కారణాల వల్ల జులై 22 కు ఒక వారం రోజులు వాయిదా వేసిబినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి త‌మిళ యువ ద‌ర్శ‌కుడు పా.రంజిత్ దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. కలైపులి ఎస్‌.థను కబాలి సినిమాను భారీ వ్యయంతో నిర్మించాడు. ఈ చిత్రంలో రజనీ హీరోయిన్ గా రాధిక ఆప్టే నటిచింది.కబాలి సినిమాలో రజినీ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.

ఇవి కూడా చదవండి:ప్యారిస్ లో కబాలి కాక

ఇవి కూడా చదవండి:కబాలీ కి విమాన ప్రచారం

English summary

Super Star Rajinikanth's Kabali movie was created hype in Audience and now a bad news for Rajinikanth Fans that Kabali movie was again postponed from July 15th to July 22nd due to some technical issues.