చైనా మార్కెట్ పై కన్ను 

Rajinikanth Targeted China Market

05:19 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Rajinikanth Targeted China Market

దక్షిణాదిన సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, ఎప్పటికప్పడు కొత్త ప్రయోగాలు చేస్తూ మార్కెట్ ని కొల్లగొట్టే రజనీకాంత్ ఇప్పుడు ఏకంగా చైనా మార్కెట్ ని ఎంచుకున్నాడు. సింగపూర్ , రష్యా , జపాన్ మార్కెట్ లలో ఇప్పటికే రజనీ సత్తా చాటగా, చైనా మార్కెట్ ని కూడా తాజా చిత్రం 'కబాలి' తో కబళించే యత్నం చేస్తున్నాడు. ఎందుకంటే చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ 'పీకె' సినిమా 100 కోట్లు పైగా కలెక్షన్ చేసింది. మరి ఇంత పెద్ద మార్కెట్ రజనీ వదులుకుంటాడా.

తమిళంలో తీసే రజనీ ఏ సినిమా అయినా, ఆటోమెటిక్ గా ఆయా భాషల్లో డబ్ అయిపోయి, విడుదలై పోతుంటాయి. అదే రీతిలో రజనీ కొత్త చిత్రం 'కబాలి' భారీ అంచనాలతో రూపొందుతోంది. ఆయా భాషల్లో డబ్ అయిపోయే ఈ సినిమా ను చైనాలో విడుదల చేస్తే, ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించిన రజనీ, అందుకు తన ఇమేజ్ ఒక్కటే సరిపోదని పసిగట్టి, చైనా స్టార్స్ ని విలన్స్ గా పెట్టుకున్నాడట.

మలేషియాకు చెందిన నటుడు రోస్యం నోర్, చైనా స్టార్‌ విన్స్‌టన్ చావో లను ఈ సినిమాలో విలన్లుగా ఎంపిక చేసినట్లు దర్శకుడు రంజిత్‌ ఇప్పటికే ప్రకటించాడు. చైనా మార్కెట్ లోకి ఎంటర్ అయితే అక్కడ 3 వేల నుంచి 5 వేల దియేటర్ లున్నాయి. ఒకేసారి అన్ని స్క్రీన్ల మీద 'కబాలి' పడితే, ఇక కాసుల వర్షానికి తిరుగే ఉండదని రజనీ భావన. ఇప్పుడు తెలిసిందా చైనా స్టార్స్ ని విలన్స్ గా ఎందుకు ఎంపిక చేసుకున్నాడో. రష్యా , జపాన్ , సింగపూర్ లతో పాటూ ఈసారి రజనీ సినిమా చైనా మార్కెట్ ని తాకబోతోంది. ఓ కుదుపు కుదపడం ఖాయంగా కనిపిస్తోంది.

కాగా నిర్మాత ఎస్‌.థాను భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌, స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్ రజనీ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ను మలేషియాలో చిత్రీకరిస్తున్నారు. వచ్చే నెల 28 వరకు మలేషియాలోనే ఘాటింగ్‌ చేసుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా మే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

English summary

Rajinikanth targeted china market to get huge collections to his upcoming movie Kabali.There were almost 1500 theaters in China and Recently PK released in China and collected 100 crores.In Kabali film malaysia actor and Chinese actor were playing villian roles