అభిమానుల్ని టెన్షన్ పెట్టిన రజనీ ట్వీట్!

Rajinikanth twitter account was hacked

12:24 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Rajinikanth twitter account was hacked

సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ అకౌంట్ ను కొద్దిసేపటి క్రితమే హ్యాకింగ్ కి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులెవరో రజనీ అకౌంట్లోకి చొరబడ్డారు. 'హిట్ టు కిల్' అని ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. అభిమానులు రజనీయే ఇలా ట్వీట్ చేశారా అని కంగారు పడిపోయారు. మీడియా, ప్రసార మాధ్యమాలు ఆ విషయాన్ని ప్రముఖంగా ప్రసారం చేశాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చర్చ కూడా మొదలైంది. అంతలోనే రజనీ జాగ్రత్తపడ్డాడు. తన అకౌంట్ ని తన ఆధీనంలోకి తీసుకొన్నారు. ఆ తర్వాత రజనీ కుమార్తె సౌందర్య స్పందించి ట్వీట్ చేసింది. నాన్న అకౌంట్ హ్యాకింగ్ కి గురైందని, అయితే అంతా సర్దుకొందని, ఇక ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదనీ ట్వీట్ చేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Rajinikanth twitter account was hacked