కబాలి అదుర్స్ ... యూఎస్‌లో ముందే చూసేసిన రజనీ

Rajinikanth Watched Kabali In USA

11:56 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Rajinikanth Watched Kabali In USA

అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తరున్న కబాలి మూవీని సూపర్‌స్టార్ రజనీకాంత్ ముందే చూసేసారు. కబాలి మూవీని యూఎస్‌లోని ఓ థియేటర్లో స్పెషల్ షో వేయగా, తన కూతురు ఐశ్వర్యతో కలిసి ఆయన వీక్షించారు. సినిమా బాగా వచ్చిందని తన సన్నిహితులతో రజనీ వ్యాఖ్యానించారట.ఇక ప్రొడ్యూసర్ థాను, డైరెక్టర్ పా.రంజిత్ కూడా హ్యాపీ. మరో 24 గంటల్లో కబాలి సునామీ సెన్సేషన్ సృష్టించనుంది. చెన్నైలో రజనీ అభిమానులు ఈ చిత్రం పోస్టర్‌ను పాలాభిషేకాలతో ముంచెత్తబోతున్నారు.

సినిమా క్లైమాక్స్ అభిమానుల అంచనాలకు తగినట్టే సుఖాంతమవుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది విషాదాంతం కావచ్చునని ఓ వర్గం మీడియాలో వచ్చిన పుకార్లకు దీంతో ఫుల్ స్టాప్ పడింది. మొత్తానికి కబాలి అదిరిపోయిందనే టాక్ స్వయంగా రజనీ నుంచే రావడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.

ఇది కూడా చూడండి: బాధ్యత లేని హన్సిక పై నిర్మాత కేసు..

ఇది కూడా చూడండి: మహా భారత యుద్ధం తర్వాత అసలేం జరిగింది

ఇది కూడా చూడండి: 'కబాలి' వెనుక దాగిన రహస్యాలు

English summary

Rajinikanth and his daughter Aishwarya Watched Kabali In USA. Kabali movie gets positive reviews .