సూపర్ స్టార్ డాటర్ డైవోర్స్?

Rajinikanth Younger Daughter Soundarya Files For Divorce

01:10 PM ON 17th September, 2016 By Mirchi Vilas

Rajinikanth Younger Daughter Soundarya Files For Divorce

ఈ మధ్య అమలా పాల్ దగ్గర నుంచి చూస్తుంటే, ఎందుకో విడాకుల వైపు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఇక సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య డైవోర్స్ తీసుకుంటోంద నే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇది నిజమేనని కూడా కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హ్యాపీగా వున్న సౌందర్య లైఫ్ లో ఏం జరిగింది? విడాకులు అప్లై చేయడానికి కారణాలేంటి? వంటి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్ తో రజనీకాంత్ కూతురు సౌందర్యకు ఆరేళ్ల కిందట మ్యారేజ్ జరిగింది. మరి ఈ యువజంట మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ సౌందర్య పిటిషన్ దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె భర్త అశ్విన్ కిడ్నీ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి రాగానే.. ఇద్దరూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకుంటారనేది చెన్నై మీడియా కథనం. సౌందర్య- అశ్విన్ కుమార్ ల మ్యారేజ్ ఆరేళ్ల కిందట చెన్నైలో ఘనంగా జరిగింది. కొద్దిరోజుల కిందట కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన సౌందర్య, సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసింది. రజనీకాంత్ హీరోగా కొచ్చాడయాన్ మూవీని ఆమె డైరెక్ట్ చేసింది కూడా.

ఇది కూడా చూడండి: బుద్ధుని గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చూడండి: అందరికీ షేర్ చెయ్యండి: ఈ హాస్పిటల్ లో వారం రోజులు పాటు హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ!

ఇది కూడా చూడండి: భార్యపై అనుమానంతో తల నరికి వీధుల్లో ఊరేగించాడు.. ఆపై..

English summary

Here is an another news of celebrity break up. Rajinikanth's Younger Daughter Soundarya Files For Divorce From Ashwin Ramkumar.