పాకిస్తాన్ కి జర్క్ ఇచ్చిన రాజ్ నాధ్

Rajnath Singh to attend SAARC meeting

11:21 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Rajnath Singh to attend SAARC meeting

మిత్ర దేశంగా నటిస్తూ శత్రువు లక్షణాలు పుష్కలంగా గల పాకిస్థాన్ తన పాడు బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. అయితే కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పాకిస్తాన్ కుటిల యత్నాన్ని తిప్పికొట్టారు. ఇంతకీ అసలు విషయం ఏమంటే, పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను పాక్ విందుకు పిలిచి అవమానించాలనుకుంది. ఈ విందును పాక్ హోం మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్ ఏర్పాటు చేశారు. సార్క్ సదస్సులో ప్రధాన కార్యక్రమం ముగియగానే రాజ్ నాథ్ కు విందు ఇవ్వాలనేది ప్లాన్. అయితే సరిగ్గా సదస్సు ముగియగానే విందు సమావేశం నుంచి పాక్ హోం మంత్రి మాయమయ్యారు. ఈ విషయం రాజ్ నాథ్ కు తెలుసో లేదో కానీ ఆయన కూడా విందుకు స్కిప్ అయ్యారు. పిలిచి అవమానించాలనుకున్న పాక్ హోం మంత్రి ఎత్తుకు రాజ్ నాథ్ పై ఎత్తు వేశారు. పాక్ ను చిత్తు చేశారు. విందుకు వెళ్లకుండా తాను బసచేసిన హోటల్ లోనే భోజనం చేసి భారత్ కు తిరుగు ప్రయాణమైన రాజ్ నాధ్ ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇది కూడా చూడండి: స్త్రీలు చేయ తగిన, చేయకూడని పనులు ఇవే

ఇది కూడా చూడండి: ఈ ఈ రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదట

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary

Rajnath Singh to attend SAARC meeting.