సంక్రాంతికి 'కబాలి'

rajni kanth kabali releasing on sankranthi

11:26 AM ON 24th November, 2015 By Mirchi Vilas

rajni kanth kabali releasing on sankranthi

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఈ పేరు తెలియని వాళ్లుండరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఈయన స్టైల్‌ చూసి చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎవరైనా అవాక్కవాల్సిందే. రజనీకాంత్‌ సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగానూ ఎంతో గొప్పవారు. ఈయన రీసెంట్‌గా నటిస్తున్న చిత్రం 'కబాలి'. పిఎ రంజిత్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించిస్తున్నారు. కొత్త డైరెక్టర్‌ అయినప్పటికీ రజనీకి కధ బాగా నచ్చడంతో రంజిత్‌తో సినిమా చెయ్యడానికి అంగీకరించారు. చెన్నైలో రియల్‌ లైఫ్‌ డాన్‌ కబాలీశ్వరన్‌ కధ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెకక్కిస్తున్నారు.

ఈ సినిమా ఘాటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చెన్నైలో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని, రీసెంట్‌గా మలేషియాలో కూడా ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుని చెన్నైకు తిరిగి వచ్చింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ దాదాపు 90 శాతం ఘాటింగ్‌ పూర్తయింది. డిసెంబర్‌ మొదటి వారం నుండి చివరి షెడ్యూల్‌ పూర్తిచేస్తాం. ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న రజనీకాంత్‌ స్టిల్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్నాంటాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో 'మహదేవ్‌' పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తారు.

English summary

rajni kanth kabali releasing on sankranthi