పుట్టినరోజు వేడుకలకి దూరంగా రజనీ!!

Rajni Kanth par to celebrate his birthday on December 12th

03:00 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Rajni Kanth par to celebrate his birthday on December 12th

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిసెంబర్‌ 12తో 65 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే చెన్నైలో సంభవించిన వరదలు వల్ల రజనీకాంత్‌ తన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. రజనీకాంత్‌ ఎప్పుడూ తన పుట్టినరోజుని ఎటువంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా జరుపుకుంటారు. అయితే ఈసారి చాలా గ్రాండ్‌గా చెయ్యాలని రజనీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్లాన్‌ చేశారట. కానీ ఇటువంటి సమయంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోనని రజనీ తన కుటుంబసభ్యులకి చెప్పారట. రజనీకాంత్‌ ప్రస్తుతం 'కబాలి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం ఘాటింగ్‌ మలేషియాలో జరుగుతుండగా చెన్నై పరిస్థితి తెలుసుకున్న రజనీ ఘాటింగ్‌ని నిలిపివేసి వెంటనే చెన్నైకి తిరిగొచ్చారు. వరదల్లో నష్టపోయిన వారికి 10 లక్షల విరాళం కూడా ప్రకటించారు. కబాలి చిత్రం తరువాత రజనీకాంత్‌ నటించబోయే రోబో-2 చిత్రం ఘాటింగ్‌ కూడా రజనీ పుట్టినరోజు నాడు లాంఛ్‌ చెయ్యాలనుకున్నారు. అయితే దీన్ని కూడా నిలిపేయమని రజనీ చెప్పారట.

English summary

Rajni Kanth par to celebrate his birthday on December 12th due to Chennai Floods.