'రోబో-2' టెస్ట్‌ షూట్‌కి రజనీ

Rajni Kanth ready for robo-2 photoshoot

12:39 PM ON 25th November, 2015 By Mirchi Vilas

Rajni Kanth ready for robo-2 photoshoot

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'కబాలి' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మలేషియా, బ్యాంకాక్‌ పరిసర ప్రాంతాల్లో ఘాటింగ్‌ పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు, ఫైనల్‌ షెడ్యూల్‌ చెన్నైలో జరగనుంది. ఫైనల్‌ షెడ్యూల్‌కి ముందు రజనీ కొంత విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో రజనీ 'రోబో-2 'లో తన గెటప్ కోసం టెస్ట్‌ చేయించుకోనున్నారు. డిసెంబర్‌ 4 నుండి 6వ తారీఖులలో ఈ టెస్ట్‌ ఘాట్‌ చేయనున్నారు. రోబో-2 లో రజనీకాంత్‌ లుక్‌ కోసం ఇప్పటికే కొన్ని స్టైల్స్‌ డిజైన్‌ చేశారు. ఈ డిజైన్స్‌ అన్నిటితో టెస్ట్‌ ఘాట్‌ చేసి రజనీకి ఏది బాగుంటే అది ఓకే చేస్తారు.

డిసెంబర్‌ 14న రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు రోబో-2 ని లాంచ్‌ చేసి జనవరి నుండి ఘాటింగ్‌ మొదలు పెడతారు. 3డిలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్‌గా రిలీజ్‌ చెయ్యడానికి దర్శకుడు శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. అందువల్ల ఈ చిత్రం రోబోకి సీక్వెల్‌ అయినప్పటికీ టైటిల్‌ 'రోబో-2' కాకుండా వేరేది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు శంకర్‌.

English summary

Rajni Kanth ready robo-2 photoshoot which was directing by Shankar.