తెలుగులో రజనీ 'కబాలి' టైటిల్‌ ఫిక్స్‌

Rajnikanth Kabali title fixed in telugu version

09:24 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Rajnikanth Kabali title fixed in telugu version

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కబాలి'. ఈ సినిమాకి తెలుగులో కూడా 'కబాలి' అనే టైటిల్‌ నే ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. మొదట్లో ఈ సినిమాకి తెలుగులో 'మహదేవ్‌' అనే పేరు పెడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కబాలి అనే టైటిల్‌ నే తెలుగులో కూడా పెట్టడానికి ఫిక్స్‌ అయ్యారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా డాన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధికా ఆప్టే హీరోయిన్‌ గా నటిస్తుంది. రజనీ సినిమా హిట్‌ అయ్యి చాలా రోజులు కావడంతో ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత షెడ్యూల్‌ను ఫిబ్రవరి 18 వరకు రెగ్యులర్‌గా కొనసాగించనున్నారు. ఈ షెడ్యూల్‌ లో చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి.

English summary

Rajnikanth tamil movie Kabali title fixed in telugu version as 'Kabali'. Ranjith Kumar is directing this movie and Radhika Apte is romancing with RajniKanth.