'అమితాబ్'ని రజనీ వద్దన్నారట!

Rajnikanth rejected Amitabh Bachchan in Robo movie

04:24 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Rajnikanth rejected Amitabh Bachchan in Robo movie

2010 లో రజనీకాంత్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రం ఎంత సూపర్‌ హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పుక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో 'ప్రోఫెసర్‌ బోరా' గా నటించిన విలన్‌ పాత్ర గురించి ఒక ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. ప్రోఫెసర్‌ బోరా పాత్రలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ని నటింపజేయాలని శంకర్‌ అభిప్రాయపడ్డారట. దీనికి రజనీకాంత్‌ అసలు ఒప్పుకోలేదట. 'రోబో' కథను తీసుకుని శంకర్‌ అమితాబ్‌ వద్దకు వెళ్లి తన అభిప్రాయాన్ని తెలియజేశాడట. అయితే అమితాబ్‌ రజనీకాంత్‌తో ఆ విషయాన్ని ప్రస్తావిస్తే 'ప్రేక్షకులు మిమ్మల్ని విలన్‌గా చూడటానికి ఇష్టపడరు' అని రజనీ చెప్పుడంతో ఆ పాత్ర చెయ్యలేదని అమితాబ్‌ తనే స్వయంగా మీడియాకి తెలియజేశారు.

ఇప్పుడు రోబో-2 లో విలన్‌గా నటించమని అడిగిన వార్తల్లో నిజం లేదని అమితాబ్‌ తెలియజేశారు.

English summary

Rajnikanth rejected Amitabh Bachchan as a villan in Robo movie.