కోటి రూపాయల లిస్ట్‌లో రాజ్‌తరుణ్‌

RajTarun Demands 1 Crore For His Next Movie

05:50 PM ON 27th November, 2015 By Mirchi Vilas

RajTarun Demands 1 Crore For His Next Movie

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన రాజ్‌తరుణ్‌ . అనతి కాలం లోనే తన ప్రతిభతో స్టార్‌డంను దక్కించుకున్నాడు. తన మొదటి చిత్రంలో గోదావరి జిల్లాల కు చెందిన యువకుడి గా తనదైన శైలిలో నటించి మెప్పించాడు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రాజ్‌తరుణ్‌ నటించిన 'కుమారి 21 ఎఫ్‌' సినిమా అఖండ విజయం సాధించడంతో మంచి జోష్‌ మీదున్నాడు.ఇప్పటి వరకు రాజ్‌తరుణ్‌ నటించిన సినిమాలకు కాను 30 లక్షల నుండి 50 లక్షల పారితోషకం తీసుకున్న రాజ్‌తరుణ్‌ , కుమారి 21ఎఫ్‌ విజయం సాధించడం తో తన తదుపరి చిత్రాలకు కోటి రూపాయలను డిమాండ్‌ చేస్తున్నాడట. ప్రస్తుతం రాజ్‌తరుణ్‌ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. మొత్తానికి కుమారి 21 ఎఫ్‌ తో రాజ్‌తరుణ్‌ తెలుగు సినీ పరిశ్రమలొ అందరిని తన వైపుకు తిప్పుకున్నాడనే చెప్పాలి.

English summary

Hero Raj Tarun Demands 1 crore for his next movies. Raj Tarun is in super sucess with his latest movie kumari 21 F stands as a super hit. Presently Raj tarun bags six movies