ఆ హీరో అప్పుడే కోటి దాటాడా

Rajtarun remmuneration upto 1 crore

11:10 AM ON 23rd November, 2015 By Mirchi Vilas

Rajtarun remmuneration upto 1 crore

'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌. ఆ చిత్రం క్లాసికల్‌ గా మంచి హిట్‌. ఆ చిత్రం తరువాత రాజ్‌తరుణ్‌ నటించిన రెండో సినిమా 'సినిమా చూపిస్తా మావా' ఇది కూడా యూత్‌ఫుల్‌ హిట్‌. రీసెంట్‌గా సుకుమార్‌ కధ, స్క్రీన్‌ప్లే అందించిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో రాజ్‌తరుణ్‌ హ్యాట్రిక్ హిట్‌ కొట్టాడు. ఈ నెల నవంబర్‌ 20న రిలీజై యూత్‌లో మంచి క్రేజ్‌ రప్పించుకున్న ఈ చిత్రం హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్తో దూసుకుపోతుంది. ఈ చిత్రంతో రాజ్‌తరుణ్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడున్న నవతరం కధానాయకుల్లో రాజ్‌తరుణ్‌ తనని తాను ప్రామిస్సింగ్‌ హీరో ప్రూవ్‌ చేసుకుని రేసులో దూసుకుపోతున్నాడు.

నాని, నిఖిల్‌, సందీప్‌కిషన్‌, నాగశౌర్య ఇప్పుడున్న కుర్రాళ్లలో లీడింగ్‌ స్టార్స్‌. రీసెంట్‌గా ఈ జాబితాలోకి రాజ్‌తరుణ్‌ కూడా వచ్చి చేరాడు. ఇప్పుడు రాజ్‌తరుణ్‌ వెంట బడా బ్యానర్స్‌ అన్నీ వెంటపడుతున్నాయి. గీతా ఆర్ట్స్‌ -14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మైంట్స్‌ బ్యానర్‌లో సినిమాలకి ఇప్పటికే సంతకం చేశాడు. మూడు సినిమాలు వరుస హిట్‌ అవ్వడంతో మార్కెట్లో తనకున్న డిమాండ్‌ బట్టి రూ. 75 లక్షలు నుండి కోటి రూపాయలు వరకు పారితోషికం తీసుకుంటున్నాడంట.

English summary

Rajtarun remmuneration upto 1 crore