కెవీపీ బిల్లుకు టీడీపీ సపోర్టు ఇస్తుందా ?

Rajya Sabha Congress MP KVP Private Bill Special To AP

09:59 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Rajya Sabha Congress MP KVP Private Bill Special To AP

రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తు వేసి,చిత్తు చేయడం.. ఇప్పుడు కేంద్రంపై గుర్రుగా వున్న టిడిపి కేంద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే యోచనలో వున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేమంటే,ఏపీ కి ప్రత్యేక హోదా పై రాజ్యసభ ఎంపీ,కాంగ్రెస్ నేత కెవీపీ ఇటీవల సభలో ఓ ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ దీనిపై ఓటింగ్ జరపాలని పట్టు బట్టే సూచనలున్నాయి. అటు ఈ బిల్లుకు మద్దతు నివ్వాలని కేవీపీ ఏపీ సిఎం చంద్రబాబుకు లేఖ రాయడంతో దీనిపై సీన్ మళ్ళీ హీటెక్కింది. టీడీపీతో బాటు వైసీపీ కూడా దీనికి సపోర్ట్ నిస్తుందా అనే ఊహాగానాలు సాగుతున్నాయి.రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందేందుకు కాంగ్రెస్ కు అవసరమైనంత మెజారిటీ ఉంది. ఒకవేళ టీడీపీ కూడా ఈ బిల్లుకు మద్దతునిచ్చి అది నెగ్గితే మోడీ ప్రభుత్వం ఇరకాటంలో పడవచ్చు. ఇక ..కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని వినియోగించు కుంతోందని బిజెపి ఆరోపిస్తోంది. ఏది ఏమైనా ఏపీ కి ప్రత్యేక హోదా అంశం కేంద్రం మీద ఒత్తిడి పెరగడానికి దారి తీస్తోంది. టిడిపి-బిజెపి బంధం కూడా ఈ దెబ్బతో వుంటుందో ఊడుతుందో తేలిపోతుందని కూడా కొందరు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ..

ఇవి కూడా చదవండి:భర్త చేతిలో మోసపోయిన హీరోయిన్

ఇవి కూడా చదవండి:ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

ఇవి కూడా చదవండి:పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

English summary

Rajya Sabha Congress MP KVP Rama Chandar Rao was going to pass a Private bill in the House for Demanding Special Status To Andhra Pradesh. KVP aksed Ysrcp MP Jagan, and Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu to Support That Bill.