అక్కర్లేని పరీక్షలతో డబ్బులు గుంజిన ఆస్పత్రి

Rajya Sabha Member MA Khan Complaints On Yashoda hosiptal

12:18 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Rajya Sabha Member MA Khan Complaints On Yashoda hosiptal

రోగం ఒకటి అయితే మందోకటి ఇచ్చే ఆసుపత్రులూ తయ్యారయ్యాయి ... ఇక అవసరం లేకున్నా ఇష్టం వచ్చినట్లు పరీక్షల పేరిట డబ్బులు గుంజే అస్సుపత్రులూ పెరిగిపోతున్నాయి... మామూలు జనమే కాదు , ప్రజా ప్రతినిధుల తాలూకు వాళ్ళు కూడా ఇలాంటి దారుణాలకు బలవుతున్నారు. సాక్షాత్తూ రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ ఈ విషయమై తాజాగా పిర్యాదు కూడా చేసారు. డయేరియాతో బాధపడుతున్న తన భార్యకు మలక్‌పేట యశోద ఆస్పత్రిలో అనవసరమైన పరీక్షలు చేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆయన ఆరోపణ. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రాజ్యసభ చైర్మన్‌ హమీద్‌ అన్సారీ, రాజ్యసభ పిటిషన్‌ కమిటీలకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి:సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

దీనికి సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలిలా వున్నాయి. ‘గతనెల 18వ తేదీన డయేరియాతో బాధపడుతోన్న నా భార్యను మలక్‌పేటలోని యశోదా హాస్పిటల్‌కు తీసుకెళ్లా. కొన్నేళ్లుగా ఆమెకు చికిత్స చేస్తున్న పార్లమెంటు డాక్టర్‌ భట్నాగర్‌తో మాట్లాడిన తర్వాతే వైద్యం చేయాలని డ్యూటీ డాక్టర్‌కు చెప్పా. పేషంట్‌ను పరిశీలించకుండానే రూ.40వేలు డిపాజిట్‌ చేయించుకున్నారు. సీజీహెచ్‌ఎస్‌ కార్డు ఉందన్నా వినలేదు. రూ.15వేలు కట్టించుకొని పేషెంట్‌ను ప్రత్యేక గదికి తీసుకెళ్లి డ్రిప్స్‌ ఎక్కించడం మొదలు పెట్టారు’’ అని ఎంఏ ఖాన్‌ వాపోయారు. తెల్లారేసరికి పదికి పైగా టెస్ట్‌లను నిర్వహించారని, తన ఒత్తిడితో డిశ్చార్చి చేశారని, రూ.26వేల బిల్లు వేశారని చెప్పారు. చేసిన టెస్టుల్లో 90శాతం అనవసరమని డాక్టర్‌ భట్నాగర్‌ ధ్రువీకరించారని ఆయన అంటున్నారు. మొత్తానికి కొన్ని ఆసుపత్రులు ఎవరినీ లెక్కచేయకుండా ఎవరైతే నాకింటి అన్నరీతిలో దండుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

'గౌతమీపుత్ర శాతకర్ణి’ పై బాలయ్య క్లారిటీ

టెర్రాస్ పై ఆ పని చేస్తుంటే టీచర్ వీడియో తీసింది

English summary

Rajya Sabha Member M.A.Khan Complaints against Yashoda Hospital . He says that he joined his wife in Yashoda hospital and the doctors in the hospital were done unnecessary tests.