ఈ అమ్మడి డ్రెస్ వెనుక అంత కథ ఉందా?

Rakhi Sawant Dress Reaction on Her Modi Dress

11:15 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Rakhi Sawant Dress Reaction on Her Modi Dress

వివాదం కొందరిని చుట్టుముడితే, కొందరు కావాలని వివాదం కొని తెచ్చుకుంటారు. అదోరకం మజా మరి. సరిగ్గా, బాలీవుడ్ నటి రాఖీ సావంత్ అదే చేసింది ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలతో ఉన్న డ్రెస్ ధరించి వివాదాలకెక్కిన నేపథ్యంలో తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. మోడీ పై ఉన్న అభిమానంతోనే ఈ డ్రెస్ ధరించానని ఈ అమ్మడు చెబుతూ,.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో హై లైట్ చేయడం గురించి, మండిపడింది. మోదీ నా డ్రీమ్ మ్యాన్.. ఆయన మన ప్రధాని కావడం నాకెంతో సంతోషం కలిగించింది..మరో 15 ఏళ్ళు ఆయన ప్రధానిగా ఉంటారు అనిరాఖీ సావంత్ పేర్కొంది.

ఎక్కడికి వెళ్ళినా మోడీ ఫోటోలతో కూడిన చీరలను కూడా డిజైన్ చేయించుకుంటానని, ఇకనైనా నా డ్రెస్ పై విమర్శలు చేయడం మాని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని రాఖీ సావంత్ హితవు పలికింది. దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి అంటూ క్లాస్ తీసుకుంది. ఇక్కడితో ఆమె ఆగిందనుకుంటే పర్వాలేదు, పైగా 'బీజేపీని ఆకట్టుకోవాలని ఈ డ్రెస్ ధరించా.. మోడీ - అమిత్ షా దృష్టిని ఆకార్చించడానికే కే ఇలా చేశా.. ఇప్పటికీ నేను బీజెపీ కూతురినే' అంటూ ఆ పార్టీ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. అమెరికాలోని షికాగోలో జరిగిన ప్రీ-ఇండిపెండెన్స్ డే వేడుకలకు హాజరైన రాఖీ, అక్కడ మోడీ ఫోటోలతో కూడిన స్కర్టు ధరించి వార్తలకెక్కింది.

1/6 Pages

English summary

Bollywood Item Bomb Rakhi Sawant recently attracted people by wearing a dresses which were printed by Narendra Modi. So many people were commented on Rakhi Dress and she reacted and said that she was a fan of Narendra Modi and she was because of that she was wearing That type of Modi Pic printed dresses.