ఫ్యాన్లు బ్యాన్ చేస్తే ఆత్మహత్యలు తగ్గుతాయి

Rakhi Sawant told that fans are reason for suicides

03:32 PM ON 6th April, 2016 By Mirchi Vilas

Rakhi Sawant told that fans are reason for suicides

అబ్బో వింత కోరికలు అంటే ఇవే... రైలు ప్రమాదం జరిగిందని రైళ్ళు, రోడ్డు ప్రమాదం జరిగిందని వాహానాలు, విమాన ప్రమాదం జరిగిందని విమానం బ్యాన్ చేయమంటే ఎలా ఉంటుంది. మరి ఈవిడ గారి డిమాండ్ అలానే ఉంది. ఇంతకీ విషయం ఏమంటే, చిన్నారి పెళ్లికూతురు టీవి సీరియల్ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్‌ రాఖీ సావంత్ కొన్ని ఊహించని విషయాలు మీడియా వద్ద వెల్లడించింది. అవి నిజమో కాదో కానీ మరో సంచలన వ్యాఖ్యం చేసాననుకుని ప్రధానికో సూచన చేసి అందరినీ మాట్లాడుకునేలా చేసింది. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్ర హింసలు పెట్టేవాడని, ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది.

ఇది కూడా చదవండి: అక్కడ అమ్మాయిలు పరీక్షలయ్యాక ఇష్టమైన వాడితో లేచిపోతారట

ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని రాఖీ సావంత్ ఆరోపించింది. అక్కడితో ఆగితే పర్వాలేదు... కానీ మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్ల పై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. 'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్-చిరూల పై పవన్ సంచలన వ్యాఖ్యలు

టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. ఇంకా నయం వైస్సార్ సీపీ గుర్తు ఫ్యాన్ కనుక దాన్ని కూడా బ్యాన్ చేయమని అడగలేదు... అడిగితే అది పెద్ద సంచలనం అయ్యేది... టీడీపి వాళ్లకు ఇంకా ఖుషీ గా ఉండేది...

English summary

Rakhi Sawant told that fans are reason for suicides. Hot beauty Rakhi sawant demanded to ban the fans.