పార్క్ లో మేము సైతం అంటూ...

Rakul Preet Singh and Rashi Khanna planted plants in park

11:12 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh and Rashi Khanna planted plants in park

మొక్కలు నాటి మేమూ పర్యావరణ పరిరక్షణ చేస్తాం అని ఇద్దరు హీరోయిన్లు అంటున్నారు. సామాజిక స్పృహతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఇలా మేము సైతం అంటూ నడుం బిగించి, హైదరాబాద్ కెబీఆర్ పార్క్ లో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికే హైదరాబాద్ గ్రీన్ సిటీగా ఉందని, కాలుష్య రహిత నగరంగా ఈ సిటీని మార్చేందుకు జరిపే ప్రయత్నాలకు తమ వంతు చేయూతనందిస్తామని చెప్పారు. ప్రభుత్వ హరిత హారం ప్రోగ్రాం కోసం ఈ హీరోయిన్లు ఇలా ముందుకొచ్చారు. అయితే చాలా సార్లు ప్రకృతి భీభత్సం సృష్టించినపుడు ఈ హీరోయిన్లు ఏమయ్యారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టేస్తున్నారు.

English summary

Rakul Preet Singh and Rashi Khanna planted plants in park