చిరు వీణ స్టెప్ ఇరగదీసిన రకుల్ ప్రీత్ సింగ్(వీడియో)

Rakul Preet Singh dances Indra Veena step in filmfare awards

06:23 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh dances Indra Veena step in filmfare awards

తాను తెలుగులో నటించిన తొలి చిత్రమే ఫ్లాప్ అయినా ఆ తరువాత సందీప్ కిషన్ సరసన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తరువాత మాచో హీరో గోపీచంద్ సరసన 'లౌక్యం' చిత్రంలో నటించింది. అది కూడా ఘన విజయం సాధించడంతో ఈ అమ్మడుకి అవకాశాలు వచ్చి పడ్డాయి. దీంతో ఈ అమ్మడు రామ్ చరణ్, అల్లు అర్జున్, రామ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా 'ఇంద్ర' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ ను వేసి ఇరగదీసింది.

అసలు ఈ అమ్మడు వీణ స్టెప్ ఎక్కడ వేసిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్ లో 63వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోలు ముఖ్యఅతిధులుగా విచ్చేశారు. వారందరినీ ఉల్లాస పరుస్తూ రకుల్ ప్రీత్ వేసిన వీణ స్టెప్ కు ఆడిటోరియం మారుమ్రోగిపోయింది. ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇదే స్టెప్ ని రకుల్ ప్రీత్ సింగ్ స్టేజి పై వేసి మెగా ఫాన్స్ లో జోష్ నింపింది.

ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ ఈలలతో రకుల్ ని మరింత ఎంకరేజ్ చేసారు. ఈ డాన్స్ ని చూస్తున్న చిరంజీవి చిన్న చిరునవ్వు నవ్వి సూపర్బ్ అంటూ కితాబు ఇచ్చారు. ఒకసారి రకుల్ వేసిన ఆ వీణ స్టెప్ ను మీరు కూడా వీక్షించండి.

English summary

Rakul Preet Singh dances Indra Veena step in filmfare awards