'చైతూ'కి నో చెప్పిన 'చరణ్' భామ

Rakul Preet SIngh ignored to act with Naga Chaitanya

01:14 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Rakul Preet SIngh ignored to act with Naga Chaitanya

యంగ్‌ హీరో నాగ చైతన్య రాబోయే చిత్రం 'మజ్ను'. ఈ సినిమా మలయాళంలో హిట్‌ సాధించిన 'ప్రేమమ్‌' సినిమాకి రిమేక్‌. ఈ సినిమాకి సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయి. 'కార్తికేయ' ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాకి దర్శకుడు. రీసెంట్‌గా నాగచైతన్య, శృతిహాసన్‌ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్‌ పై ఉన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించడంలో బిజీగా ఉన్నారు. గతంలో మూవీ మేకర్స్‌ మూడవ హీరోయిన్‌ పాత్ర కోసం రకుల్‌ప్రీత్‌సింగ్‌, రెజీనా కసాండ్రా అని అనుకున్నారు. అయితే రకుల్‌ తన రాబోయే సినిమాలో తక్కువ ప్రధాన్యత ఉన్న పాత్రలో నాగచైతన్య సరసన నటించనని చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు రకుల్‌ తన కెరీర్‌ లో టాప్‌ పొజిషన్‌ లో ఉండడమే దీనికి కారణం అయి ఉండొచ్చు. ఇటీవల ఈమె నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. మెగా హీరో అల్లు అర్జున్‌ రాబోయే సినిమా 'సరైనోడు' లో బన్నీ సరసన రకుల్‌ కనువిందు చేయనుంది.

English summary

Rakul Preet SIngh ignored to act with Naga Chaitanya in Majnu movie. Shruti Hassan and Anupama Parameswaran was romancing with Naga Chaitanya in this movie. Chandu Mondeti was directing this film.