అమాంతం రేటు పెంచిన రకుల్

Rakul Preet Singh increased remuneration

11:13 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh increased remuneration

టాలీవుడ్‌ లో వరుస అవకాశాలతో దూసుకువెళ్తున్న హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మొదట్లో రకుల్‌ చేసిన బ్రూస్‌లీ, కిక్‌ -2 వంటి సినిమాలు పరాజయాన్ని పొందాయి. దీంతో రకుల్‌ కి ఐరెన్‌లెగ్‌ అనే ముద్ర పడింది. ఆ సమయంలో స్టార్‌ హీరోలు తమ సినిమాల్లో ఈమెను తీసుకోవాలా వద్దా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. అయితే ఇటీవల విడుదలైన 'నాన్నకుప్రేమతో' సినిమా భారీ విజయం సాధించడంతో రకుల్‌ దశ తిరిగింది. నాన్నకుప్రేమతో సినిమాతో రకుల్‌ కి డిమాండ్‌ బాగా పెరిగింది. రకుల్‌ తనకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రెమ్యూనరేషన్ అమాంతం రెట్టింపు చేసిందట.

దాదాపు కోటి రూపాయలకు పైగానే డిమాండ్‌ చేస్తోందట. ఏ చిన్న ఫంక్షన్‌ కు హాజరవ్వాలన్నా 30 లక్షలు ఇవ్వకపోతే రానని చెప్పేస్తోందట. ఇలాంటి వార్తల పై రకుల్‌ కొన్ని విషయాలను స్పష్టం చేసింది. తన కెరీర్‌ ఆరంభంలో చాలా తక్కువ పారితోషకం తీసుకునేదట. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్‌ను బట్టి పెంచిందట. అయితే ఇది ప్రొడ్యూసర్లకు అంత భారంగా ఏమి ఉండదని చెప్తోందట. పారితోషికం ఎంత తీసుకున్నా కష్టానికి తగిన ఫలితం ఉంటుందని వివరించిందట. ప్రస్తుతం రకుల్‌ 'సరైనోడు' సినిమాలో బిజీగా ఉంది. ఈ సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో మరో సినిమాకి రకుల్‌ ఒప్పుకుందట.

English summary

Rakul Preet Singh increased her remuneration upto 1 crore. After Nannaku Prematho getting super hit she increased her remuneration. Now Rakul is acting in Sarainodu movie.