లవ్ మ్యారేజ్ కి ఫిక్స్ అయిన రకుల్

Rakul Preet Singh likes love marriage

03:19 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh likes love marriage

ఇమేజ్ కన్నా పదికాలాల పాటు నిలిచే సినిమాల మీద దృష్టి పెడుతున్న ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అతి తక్కువ టైంలోనే అందరి మనసులను దోచేసింది. ఈ ఇయర్ లో జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో సరైనోడు సినిమాలతో హిట్లు అందుకున్న రకుల్ టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అయ్యింది. మొన్నటిదాకా ఓ మోస్తారు హీరోలతో చేసిన హీరోయిన్ ఇప్పుడు స్టార్ హీరోల పక్కన మాత్రమే అంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ తో తని ఒరువన్ రీమేక్ 'ధృవ' సినిమా చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఓకే అయ్యింది. అంతేకాదు సరైనోడు సినిమాలో తను రాసుకున్న పాత్రకు తెర మీద జీవం పోసిందని రకుల్ ను తన తర్వాత సినిమాలో కూడా తీసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.

ఇది కూడా చదవండి: భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

మరి ఈ రేంజ్ లో రేసుగుర్రంలా పరుగెడుతున్న అమ్మడి కెరియర్ చూస్తుంటే నిరంతరాయంగా మరో ఐదారేళ్లు దిగ్విజయంగా కొనసాగేలా ఉంది. సో పెళ్లి గిల్లి లాంటివన్ని పక్కన పెట్టేసి రకుల్ కెరియర్ పై దృష్టి సారిస్తే మంచిది. ఇంతవరకూ బానేవుంది, మరి కెరియర్ కి అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకోబోతుందా అంటే అలా ఏం లేదు కాని రీసెంట్ గా ఓ స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొని తన పెళ్లి వార్తల గురించి ప్రస్థావించింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇంతకీ ఆ అమ్మడు ఎవరంటే టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ తాజాగా చెప్పిన మాటల ప్రకారం చూస్తే, ఈ అమ్మడు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోదట. పోనీ ఇష్టమొచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోదట.

ఇది కూడా చదవండి: బన్నీకి పవర్ స్టార్ ఫ్యాన్స్ వార్నింగ్?

ఎలా అంటే ఈ భామ చెప్పే లాజిక్ మాత్రం బానే వుందని అంటున్నారు. అదేమంటే, ప్రేమించి ఆ ప్రేమను పెద్ద వాళ్లు అంగీకరించేలా చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటుందట. అయితే ఇప్పుడప్పుడే అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు. అసలే ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేశా అంటూ వయ్యారాలు ఒలకబోస్తోంది. ఇక పనిలో పనిగా మహేష్ బాబుతో సినిమా చేయకుండా పెళ్లెలా చేసుకుంటా అంటూ సూపర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని కూడా చాటేసుకుంది.

ఇది కూడా చదవండి: భార్యను చంపి సేమ్ 'దృశ్యం' సినిమా కధలా మలిచాడు

English summary

Rakul Preet Singh likes love marriage. Hot beauty Rakul Preet Singh is interested in Love come arranged marriage.