గ్యాంబ్లింగ్ చేసి డబ్బులు పోగొట్టుకున్న రకుల్.. ఎంత పోయాయో తెలిస్తే షాకౌతారు!

Rakul Preet Singh lost 200 dollars in gambling

05:14 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh lost 200 dollars in gambling

'కెరటం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. తన మొదటి చిత్రమే అట్టర్ ఫ్లాప్ అయినా ఆ తరువాత సందీప్ కిషన్ సరసన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత మాచో హీరో గోపీచంద్ సరసన 'లౌక్యం' చిత్రంలో నటించింది. అది కూడా ఘన విజయం సాధించడంతో ఈ అమ్మడుకి అవకాశాలు వచ్చి పడ్డాయి. దీంతో ఈ అమ్మడు రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే అందరి హీరోయిన్లు ఒకే దారైతే రకుల్ ది మాత్రం భిన్నమైన దారి. రకుల్ ది బిజినెస్ మెన్ మైండ్.

ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. మరోపక్క పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తుంది. ఒక్క రూపాయి కూడా పోనివ్వదు. అయితే తాజాగా అమ్మడుకి ఒక విషయంలో మాత్రం దెబ్బ పడిందట. ఆ వివరాల్లోకి వెళితే.. గ్యాంబ్లింగ్.. చాలామందిని ఆకట్టుకుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ సంపాదిచ్చేయంటూ బాగా టెంప్ట్ చేస్తుంది. రకుల్ కూడా ఈ విషయంలో ఓసారి టెంప్ట్ అయిందట. అలాగని ఎక్కువేం పెట్టుబడి పెట్టేయలేదు. ఈ మధ్యే అమ్మడు ఓ వెకేషన్ టూర్ కి వెళ్లింది. వాళ్లూ వీళ్లూ అయితే మళ్లీ మూడ్ డిస్టర్బ్ అవుతుందనే ఫీలింగ్ తో.. ఎంచక్కా ఓ కాలేజ్ ఫ్రెండ్ ని తీసుకుని లాస్ వేగాస్ టూర్ వేసింది రకుల్.

మరి లాస్ వేగాస్ వెళ్లేదే గ్యాంబ్లింగ్ ని ఎంజాయ్ చేయడం కోసం కదా. అందుకనే అక్కడ ట్రై చేసింది రకుల్ ప్రీత్ సింగ్. గ్యాంబ్లింగ్ లో రకుల్ సంపాదించిందేం లేదు. పైగా 200 డాలర్లు పోగొట్టుకున్నానని చెబుతోంది. మన కరెన్సీలో అయితే 13 వేల పై మాటే. ఇది రకుల్ కి పెద్ద మొత్తం కాదని మనం అనుకోవచ్చు కానీ.. ప్రతీ రూపాయకి చాలా విలువిచ్చే రకుల్ గ్యాంబ్లింగ్ లో పోగొట్టుకున్న మొత్తాన్ని చాలా సీరియస్ గా తీసుకుందట. మళ్లీ అటువైపు వెళ్లనని ఒట్టు వేసుకుందట.

ఇది కూడా చదవండి: గుండె జబ్బుకు శృంగారమే సరైన మందు!

ఇది కూడా చదవండి: గుండు గీయించుకుంటున్న టాప్ హీరోయిన్

ఇది కూడా చదవండి: కోహ్లీ ఇల్లు కొన్నాడు .. ఖరీదు తెలిస్తే షాకే

English summary

Rakul Preet Singh lost 200 dollars in gambling