రూమర్స్ పై క్లాస్ పీకిన రకుల్

Rakul Preet Singh Reacts On Rumors

10:25 AM ON 7th May, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh Reacts On Rumors

గాసిప్స్ అంటేనే అదో కిక్కు ...కొందరు ఎంజాయ్ చేస్తారు...మరికొందరు ఉడుక్కుంటారు...ఇక సినీ తారల చుట్టూ బోల్డన్ని వార్తలు తిరుగుతుంటాయి. ఫలానా హీరోయిన్ అలా చేసిందట, వాళ్లతో ప్రేమలో పడిందట,పారితోషికం పెంచేసిందట...అంటూ రకరకాల రూమర్స్ పుట్టేస్తుంటాయి. కొంతమంది హీరోయిన్లు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకుంటే, మరికొందరు విన్నా, విననట్టు వూరుకొంటారు. అయితే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ని మాత్రం డిఫరెంట్ గానే స్పందిస్తోంది. ‘‘ రూమర్స్ ని నేను పట్టించుకొంటా. ఎందుకంటే నాకంటూ ఓ కుటుంబం ఉంది. వాళ్లంతా ఇలాంటి వార్తల గురించి ఏమనుకొంటారో అన్న బెంగ ఉంటుంది. ఇంట్లో వాళ్లకు నేనంటే ఏంటో తెలుసు. కాబట్టి ఇలాంటి వార్తల్ని తేలిగ్గా తీసుకొంటుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎంతకాలం చూసీ చూడనట్టు వూరుకుంటారు? ఏదో సందర్భంలో వాళ్ల ఓపిక కూడా చచ్చిపోతుంది’’ అంటోంది. ‘‘నా గురించి రాసుకోండి. తప్పులేదు. కానీ మరీ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు. నా నటన గురించి విశ్లేషించే హక్కు, విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. జీవితం గురించి మాత్రం కాదు’’ అని రకుల్ తెగేసి చెప్పేస్తోంది. అయినా మనవాళ్ళు ఊరుకుంటారా?

ఇవి కూడా చదవండి:

బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్‌ ( వీడియో )

ఎక్స్ హోం మినిస్టర్ మనవడితో డేటింగ్

వర్మపై పగబట్టిన హీరోయిన్ ఎవరు?

English summary

Heroine Rakul Preeth Singh fires on the Rumors Coming About Her. She says that no body have rights to talk about her personnel life.She also said that they have only rights to talk about her acting only.